కక్ష సాదింపులతో ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయ వదు
కేసీఆర్ కు కాంగ్రెస్ నేత జి.నిరంజన్ హితవు
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
కె.సి.ఆర్ తన అధికార కాంక్ష,, కక్ష సాదింపులతో ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయ వద్దు అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ హితవు పలికారు. ఈటెల రాజేందర్ పై విచారణ, ప్రత్యారోపణల దృష్ట్యా కె.సి.అర్ పాలనపై సి.బి.ఐ విచారణ జరపాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా పాజిటివ్ తో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఫామ్ హౌజ్ లో, అంతా తానై వ్యవహరించే కె.సి.అర్ తనయుడు మంత్రి కె.టి.అర్. ఆస్పత్రిలో మరియు ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా కేసులో ఇరుక్కుని విచారణలతో సతమతమవుతుంటే , ఇక కరోనా కోరల్లో ఇరుక్కున్న ప్రజలకు దిక్కెవరు అని ఆయన ప్రశ్నించారు. 18- 45 మధ్య వయస్సున్న వారికి ఇస్తామన్న వ్యాక్షిన్ కు అడ్రస్ లేదు , అతీ గతీ లేదని ఆయన విమర్శించారు. వ్యాక్షిన్ కొరత వలన ఇవాళ, రేపు ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్షిన్ వేయమని ప్రకటించిన ప్రభుత్వం ఆసుపత్రులలో బెడ్లు లేవు, ఆక్షిజన్ లేదు, మందులు లేవు అని వాటిని ప్రజలు బ్లాక్ లో కొనాల్సిన పరిస్తితులు తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. ప్రజలు ఇన్ని అగచాట్లు పడుతున్నా ఫామ్ హౌజ్ లో పడకేసిన ముఖ్యమంత్రి ఆఘమేఘాలమీద ఈటెల కబ్జా భూముల విచారణకు మొత్తం అధికార యంత్రాంగాన్ని రాత్రికి రాత్రి పంపించగలరు, కానీ ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాత్రికి రాత్రి వ్యాక్షిన్, మందులను, బెడ్లను, ఆక్షిజన్ ఏర్పాట్లు చేయలేరా అని ఆయన ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్ అరికట్టలేరా అని ఆయన నిలదీశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.... కరోనా విశృంఖలంగా వ్యాప్తి చెందుతున్నా ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పురపాలక ఎన్నికలు నిర్వయించారు. ఆరోగ్య శాఖా మంత్రిగా కరోనా పరిస్తుతులను రోజు వారీగా పర్యవేక్షిస్తున్న ఈటెలపై విచారణకు ఇదే సమయాన్ని ఎందుకు ఎంచుకున్నారో కె.సి.అర్ జవాబు చెప్పాలి. ఈ మహమ్మారి ఇంతగా ప్రజల జీవితాలను అతలాకుతలము చేస్తున్న వేళ ముఖ్య మంత్రి కె.సి.ఆర్ కున్న ప్రాధాన్యతలేమిటో , ప్రజల ప్రాణాలపట్ల ఆయన కున్న పట్టింపు ఎంతో తేలి పోతుంది ఈ చర్యతో. కె.సి.ఆర్ తన అధికార కాంక్ష, కక్ష సాదింపులతో ప్రజల ప్రాణాలను గాలికి వదిలేయ వద్దు. మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలపై కె.సీ.ఆర్ విచారణకు ఆదేశించడము, ఈటెల కూడా వందల కోట్లు కూడబెట్టిన వారిపై కూడా విచారణ జరుపాలని కోరడము చూస్తే మొత్తము కె.సి.ఆర్ పరిపాలనపై సి.బి.ఐ విచారణ జరుపాలి. అని ఆయన డిమాండ్ చేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: