తిరుపతి ఘటన పునరావృత్తం కారాదు 

ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి యూనుస్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

తిరుపతి ఘటన పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి యూనుస్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనులు లేక కుటుంబాలు గడవలేని స్థితిలో ఉన్నారని, తమిళనాడు తరహా వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా ఉండడం వలన పనులు లేక, ఇటు పనికి వెళ్లలేక చాలా దీన స్థితిలో ఉన్నారని అయినప్పటికీ కూలీలు, కార్మికులు, కర్షకులు చాలా మంది రోడ్డు మీదకి పనుల కోసం వస్తున్నారని పనులు దొరకక ఇబ్బందులకు గురవుతున్నారని, సీఎం జగన్ రోజు వారి కూలీలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కరోనా వాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: