ఏంపీజే ఆద్వర్యంలో,,,

రంజాన్ కిట్ల పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)  

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శాఖ ఎం.పి.జె. ఆద్వర్యంలో గత 5 సంవత్సరాలుగా దాతల సహాకారంతో కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది. రంజాన్ పండుగ జరుపుకోలేని నిరుపేదలకు,వితంతువులకు,అనాధలకు దాదాపు 107000-00 (లక్ష ఏడు వేల రూపాయలు) విలువ గల నిత్యావసరవస్తువులు పేదలకు వితరణ ఇవ్వడం జరిగింది.   ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా మనిసిపల్ వైస్ ఛైర్మన్ షేక్ ఇస్మాయిల్ గారు, విశిష్ట అతిథులుగా డాక్టర్ సయ్యద్ మక్బుల్ బాష, మునిసిపల్ డి.ఇ.  షేక్ సుభాని,ముత్తవల్లీల కమిటీ గౌరవ అధ్యక్షులు షేక్ నాగూర్ వలి, కమిటీ ఉపాద్యక్షుడు        షేక్ కరీముల్లా  పాల్గొని కీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అహ్వనితునిగా విచ్చేసిన ఏంపీజే రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి కనీస అవసరాలు తీర్చాల్సిన భాద్యత ప్రభుత్వాలదని, కాని నేడు కరోన వ్యాదిగ్రస్తులకు ఆక్సిజన్,వ్యాక్సిన్ ఇవ్వడంలొ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధిగా, ప్రెజర్ గ్రూపుగా ఎంపీజే పనిచేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీజే ఫౌండర్ మెంబర్ షేక్ రసూల్, జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ గఫూర్, మోధి మస్జిద్ ముత్తవల్లీ షేక్ దస్తగిరి, పట్టణ నాయకులు      షేక్ సలామ్ , అమీర్, మీరావలి, ఖాశింసా, చాంద్, రఫీ, జవాద్, రషీద్, షెక్ష, యూసుఫ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.


మార్కాపురం మనిసిపల్ వైస్ ఛైర్మన్ షేక్ ఇస్మాయిల్

షేక్. సుభాని, డి.ఇ.మార్కాపురం మున్సిపాలిటి

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: