మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లోనే

చేతులెత్తి ప్రజలకు విన్నవించుకొంటున్న పోలీసులు

సమాజ శ్రేయస్సు రిత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్లు, కర్ఫ్యూలు పెడుతున్నా కోవిడ్ కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ ఇండ్లలో సురక్షితంగా ఉండలన్న అవగాహన లోపమే ఈ సమస్యకు పరిష్కారం. వాస్తవ విషయాన్ని పసిగట్టిన కర్నూలు జిల్లా గడివేముల పోలీసులు కరోనా వేళ ఇండ్లలో ఎందుకు ఉండాలో అన్న దానిపై ప్రజల్లో అవగాహన ముఖ్యమని భావించారు. కర్ఫ్యూ అమలు కోసం కఠినంగా వ్యవహరిస్తూ తమ విధులను బాధ్యతగా నెరవేర్చుతూనే ప్రజల్లో కోవిడ్ నియంత్రణ ఎలా చేయాల్లో అవగాహన వచ్చేలా తమ చర్యల ద్వారా చూపిస్తున్నారు.

ఇటీవల గడివేముల మండల లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అనవసరంగా రోడ్డుపైకి వచ్చే ప్రజలకు పోలీసులు దండం పెట్టి అలా భయటకు రావద్దు. మీ ఆరోగ్యం భద్రతా మీ చేతుల్లోనే అని అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు తాము మీ భద్రత కోసం ఎంతటి సౌమ్యంగా చెబుతున్నామో మీరు నిర్లక్ష్యంగా బయటికి వస్తే మాత్రం సమాజశ్రేయస్సు రిత్యా అంతే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనా పై పోరాడుతున్న వారియార్స్ లో తొలిస్థానంలో వైద్యులు వుంటే ఇంచుమించు అంతే స్థాయిలో కరోనా వారియార్స్ గా పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఇరవై గంటల నిర్విరామ విధులు నిర్వహిస్తూ తమ కుటుంభాలను పణంగా పెడుతున్నారు పోలీసులు. మరి మన కోసం, మనందరి కోసం పోలీసుల చేస్తున్న హెచ్చరికలు మన కోసమే కదా అని ఇక ప్రజలే అర్థం చేసుకోవాలి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: