యథా రాజా తథా ప్రజా
లాక్ డౌన్ ఉల్లంఘనలకు కేసీఆరే కారణం
కాంగ్రెస్ నేత జి.నిరంజన్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
ప్రజలు లాక్ డౌన్ ను తేలికగా తీసుకోవటానికి కారణం ముఖ్యమంత్రి కె.సి.ఆరేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ పేర్కొన్నారు. ఓవైపు అందర్నీ మాస్క్ ధరించాలని ఆదేశిస్తూ మరోవైపు స్వయంగా కేసీఆర్ మాస్క్ లేకుండా వరంగల్ జైలు సందర్శించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా జి.నిరంజన్ మాట్లాడుతూ...తాను స్వయంగా కోవిడ్ నిబంధనలు పాటించ కుండా ఇతరులను పాటించమని సీఎం కేసీఆర్ ఎలా మార్గనిర్దేశం చేస్తారని ఆయన ప్రశ్నించారు. స్ట్రిక్ట్ గా అమలు చేయమని కె.సి.ఆర్ రాష్ట్ర డి.జి.పి ని ఆదేశిస్తే పోలీసు యంత్రాంగం చలానలు రాయడం, వాహనాలు జప్తు చేయడం వంటి చర్యలతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుందని ఆయన అన్నారు. లాక్ డౌన్ వేస్ట్ అన్న కె.సి.ఆర్ లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేయాలని డీజీపీని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ చేపట్టామంటున్న కె.సి.ఆర్ కు ప్రజలు కోల్పోతున్న ఆదాయం, ఉపాధి గురించి పట్టింపే లేదని విమర్శించారు. ఒక వైపు కరోనా బారిన పడిన ప్రజలకు వైద్య సౌకర్యాలు, మందులు, వ్యాక్షిన్లు లేవు, మరొక వైపు లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వ పక్షాన ఆసరా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వమిచ్చిన నాలుగు గంటల వ్యవధిలో తమ వ్యాపారాలు 10 గంటల వరకు చేసుకుని, మూసిన తర్వాత ఎలాగా తమ ఇళ్లకు చేరగలరనే సోయి ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... అస్తవ్యస్త వ్యవహారము, పోలీసుల అత్యుత్సాహ కారణాన విద్యుత్ ఉద్యోగులు నల్గొండలో ఈ రోజు రెండు గంటల పాటు విద్యుత్ సరపరా నిలిపి వేయడము, పరిస్తితికి అద్దము పడుతుందన్నారు. లాక్ డౌన్ విధించి ప్రభుత్వము చేతులు దులుపు కోవద్దు. ప్రజల కనీస అవసరాలను ఉచితంగా అందజేయాలి. ప్రభుత్వము అందజేస్తే ప్రజలెందుకు బయట కెళ్ళి తిప్పలు పడతారు.పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాలు కె.సి.అర్ ను ప్రసన్నము చేసుకోవడానికి, తృప్తి పరచడానికి, ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దు. వారి అవసరాలను ప్రభుత్వము తీరిస్తే ఎవ్వరూ బయటకెళ్లరని గమనించాలి. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రజలను ఆదుకునేందుకు ఇక తాను చేసేది ఏమి లేదని చేతులెత్తేసినట్టుంది, అందుకే గాంధీ, ఎం.జి.ఎం ఆసుపత్రుల బాట పట్టారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది,జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటు, వరంగల్ కెంద్ర కారాగారాన్ని తరలించి అక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడము కాదు, వారికి కావల్సింది తత్క్షణ చేయూత, వైద్య సౌకార్యాలు, మందులు, వ్యాక్షిన్, ఆక్షిజన్,. థర్డ్ వేవ్ నుండి సంరక్షణ ఆయన పర్యటనలు చిత్తశుద్ధి లేనివి. కేవలము ఏదో చేస్తున్నట్టు ప్రజలను మభ్య పెట్టి, మీడియా దృష్టిని అసలు సమస్యలపై కాకుండా తన చుట్టు త్రిప్పు కోవడానికే. అని ఆయన పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: