రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేద్దాం 

రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా మే-డే

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై రైతులు ఐక్యంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని, పోరాటాలను తీవ్రతరం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే-డేను ఘనంగా నిర్వహించాలని ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం ఎదుట సంఘం జెండాను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ అధ్యక్షతన జరిగిన సభలో సాగర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక, వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యాన్ని నాశనం చేసే వినాశకరమైన విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయాన్ని ప్రైవేటికరణచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చ, అసమ్మతి హక్కు మొదలైనవాటిని ఆరికట్టడంతో పాటు కార్మిక కోడ్స్‌ అమలు చేయడం ద్వారా శ్రామిక ప్రజలను బానిసలుగా మార్చే పరిస్థితులు తీసుకొస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారి రెండో దశను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని విమర్శించారు. మోడి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాల వలన ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ బలహీనపడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యాక్సిన్‌ విధానం వల్లప్రజల సొమ్మతో లాభాలను ప్రోత్సహించడానికి ప్రయత్నం జరిగిందని అన్నారు. మహమ్మారి సవాలును ఎదుర్కోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వ అనాగరిక విధానాన్ని తీవ్రంగా ఖండించారు. అందరికీ ఉచిత టీకా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్‌, వ్యకాస రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి ప్రసాద్‌, ఆర్‌ వెంకట్రాములు, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కిషోర్‌, రాహుల్‌, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: