ఉపాధి పర్యటనలు చేపట్టండి
ఎం నాగేశ్వర్ రావు పిలుపు
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)
జిల్లా వ్యాప్తంగా సంఘం నాయకులు కార్యకర్తలు ఉపాధి పర్యటనలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తల సమావేశం నందికొట్కూరు సంఘం కార్యాలయంలో పి పకీర్ సాహెబ్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి పనులు దగ్గరికెళ్ళి ఉపాధి కూలీల సమస్యలను తెలుసుకోవాలని వారు తెలిపారు ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు అనేక గ్రామాల్లో పనులు కల్పించడం లేదు గత ఐదు నుండి పది వారాలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి పనులు దగ్గర అ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉపాధి కూలీలకు అండగా కార్మిక సంఘం కార్యకర్తలు ఉండాలని వారు కోరారు.
ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం గ్రామ సచివాలయం ముందు మండల ఎంపిడిఓ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధి పీడీ జిల్లా కలెక్టర్ దృష్టికి ఉపాధి కూలీలను సమస్యలను రాతపూర్వకంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు ఉపాధి కూలీలను సంఘంలో సభ్యత్వం చేర్పించాలని ఉపాధి గ్రామ కమిటీల ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు చైతన్య పరచాలని ఆయన కోరారు ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు వి శ్రీనివాసులు బెస్త రాజు రజిత నారాయణ పకీరయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: