షబ్బీర్ అహ్మద్ మరణం తీరనిలోటు

వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్ మరణించారు.  గురువారం ఉదయం రాజమండ్రిలో ఆయన కన్నుమూశారు. షబ్బీర్ అహ్మద్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు. షబ్బీర్ అహ్మద్ మరణం పార్టీకి తీరని లోటని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర ఫెడరల్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు , న్యాయవాది ఐ.ఎం. అహమ్మద్  పేర్కొన్నారు. విశాఖపట్టణంలోని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా క్యాంప్ ఆఫీస్ లో సంతాప కార్యక్రమం చేపట్టారు.

 

షబ్బీర్ అహ్మద్
 

షబ్బీర్ అహ్మద్ మరణంతో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా గొప్ప నాయకున్ని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏ లాంటి ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యలపై మైనార్టీ బడుగు, బలహీన వర్గాల సమస్యలపై పోరాడి ఆ వర్గాలకు ఆయన చేసిన సేవ మరువలేనిదని కొనియాడారు. షబ్బీర్ అహ్మద్ కు అల్లాహ్ స్వర్గప్రాప్తి కలిగించాలని ఆయన దువా చేశారు. షబ్బీర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు ఐ.ఎం. అహమ్మద్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కు షబ్బీర్ అహ్మద్ ఎంతో సేవ చేశారని కొనియాడారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

1 comments:

  1. షభ్భీర్ అహమ్మద్ గారిలాంటి బహుజన నాయకులను కోల్పోవడం సమాజానికి ఎంతో లోటు. ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలయజేస్తున్నాం. జైభీమ్ .

    రిప్లయితొలగించండి