మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

హిందూపురం అఖిలపక్షం డిమాండ్


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి) 

ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందక మరణానికి కారణమైన వారిపై జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రివద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఆక్సిజన్ అందక మరణించిన కోవిడ్ బాధితులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా 50 లక్షలతో పాటు మరణానికి కారణమైన వారిపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్సిజన్ సరఫరా మీద దర్యాప్తు చేసి సక్రమంగా బాధితులకు ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకోవాలని దాదాపు 50మంది సిబ్బంది కొరతను భర్తీ చేయాలని,ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జన్సీ విభాగంలో నిత్యం ముగ్గురు వైద్యులు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని.

 

కోవిడ్ టెస్టుల పరీక్ష నిర్ధారణ వెంటనే వచ్చేలా చేయాలని.కోవిడ్ బాధితుల కోసం కేటాయించిన ప్రయివేటు ఆసుపత్రుల వెంటనే కోవిడ్ పేషేంట్లకు భర్తీచేసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని. మెడికల్ షాపులు కోవిడ్ మాత్రలు ఇంజెక్షన్ ధరల పట్టికను బహిరంగ పర్చాలని. కోవిడ్ మహమ్మరిని ఆరోగ్యశ్రీ కు వర్తింపజేయాలని. తదితర డిమాండ్లను జిల్లా కలెక్టర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కోవిడ్ బాధితులకు  న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఇంతియాజ్ కాంగ్రెస్ నాయకులు బాలాజీ మనోహర్. తెలుగుదేశం నాయకులు డీఈ. రమేష్.ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఉమర్ ఫారూఖ్ ఖాన్.అమానుల్లా. సిఐటియు జిల్లా నాయకులు ఇ ఎస్ వెంకటేష్, నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పెద్దన్న, మొబైల్స్ యూనియన్ నాయకులు ఇబ్రాహీం.ముజ్జు.తదితరులు ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: