రంజాన్ 'రంజాన్ ముబారక్' చిత్రం ఆవిష్కరించిన
అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో నేడు గురువారం "నూరే ఈదుల్ ఫితర్" రంజాన్ ముబారక్ చిత్రాన్ని ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. మాట్లాడుతూ పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని, రంజాన్ పండుగ సోదరభావం సహజీవనం సామరస్యం ఐకమత్యానికి ప్రతీక అని బిదవాడు ఆకలితో అలమటిస్తుంటే ధనవంతులు స్పందించాలని, జఖాత్ విధిగా ఉన్నవారు,
లేనివారికి ఉన్నదాంట్లో కొంత శాతం, తప్పకుండా దానము చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైవసల్లం అల్ ఖురాన్ లో తెలియజేశారు. కోవిడ్19 సెకండ్వెవ్ విజృంభిస్తున్నందున విధి విధానాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు, రంజాన్ పండుగ ప్రపంచ మానవాళికి సామరస్యం సౌభాతృత్వం ఐకమత్యం సుఖ సంతోషాలు శాంతి భద్రతలు అందించాలని మానవతా చిత్రకారులు రుస్తుం అకాక్షించారు. కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్యచిత్రకారుడు నహీంరుస్తుం,మహ్మద్ రహీం, రిజ్వానా బేగం,ఆశబేగం, నేచర్ పెయింటర్ రూబీనారుస్తుం, మైనారిటీనేత ముస్తఫా తదితరులు పాల్గొని రంజాన్ ముబారక్ తెలియజేసారు.
Post A Comment:
0 comments: