మార్గం తెలియని గమ్యం,,,అగమ్య గోోచరంలో ప్రతిపక్షాలు
అజేయశక్తిగా వైసీపీ,,ప్రతిపక్షాల ఉనికిపాట్లు
కలవని జెండాలు...?
రెండేళ్ల అనంతరం కూడా సత్తా చాటిన వైసీపీ
చెల్లాచెదురుగా ప్రతిపక్షాలు,,ఎవరి అజెండా వారిది
(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో బలమైన రాజకీయ శక్తిగా వైసీపీ ఎదుగుతుంటే తొలినుంచి ఓ పట్టిష్టమైన క్యాడర్ కలిగిన టీడీపీ సైతం నేడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజా సంక్షేమ పథకాలు అధికార వైసీపీని జనంలోకి బలమైన శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతుంటే ఆ పార్టీ ప్రభుత్వం తీసుకొంటున్న కొన్ని నిర్ణయాలు విమర్శలకు గురవుతున్నా దాని ప్రభావం ప్రజల్లో పెద్దగా చూపడంలేదు. ప్రభుత్వం తీసుకొంటున్న కొన్ని నిర్ణయాలతో అక్కడక్కడా సమస్యలు తలెత్తుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే దీని ప్రభావం వైసీపీపై తీవ్రంగా చూపించలేకపోతున్నాయి. దీనికి కారణం రాష్ట్రంలోని ప్రతిపక్షాల వైఫల్యం కూడా దాగివుందని రాజకీయ విశ్లేషకుల పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వారి వ్యక్తిగత అజెండాలు కూడా ప్రభుత్వానికి కలిసొస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
2019లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చినా వైసీపీ ఆ తరువాత వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ తన సత్తా చాటుతోంది. ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రభావం ఏ మాత్రం కనిపించడంలేదు. దీంతో ఇక వైసీపీకి తిరుగులేదన్న రీతిలో ఏపీలో రాజకీయాలు మారాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను పెద్దఎత్తున్న వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నా ఆ పార్టీ ప్రభుత్వం తీసుకొన్న కొన్ని నిర్ణయాలు సైతం విమర్శలకు గురైన విషయం తెలిసిందే. ఇసుక పాలసీ, ఇటీవల ఇంటి పన్ను పెంపు వ్యవహారం ఇలా అనేక అంశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అయినా ప్రతి ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉంది. ప్రతిపక్షాలు కనీసంగా తమ ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. దీనికి బలమైన కారణం రాష్ట్రంలోని ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షాలు విడివిడిగానే పోరాటం చేస్తున్నాయి. టీడీపీ, సీపీఐ పలు సందర్భాలలో ఏకంగా పోరాడుతున్నా, కాంగ్రెస్, సీపీఎం తమ తమ సొంత బాటలో నడుస్తుండగా. బీజేపీ, జనసేన సైతం ఓ కూటమిగా ఏర్పడి పోరాటాలు చేస్తున్నాయి. టీడీపీ సైతం రాష్ట్రాన్ని పాలించిన పార్టీల్లో టీడీపీ కూడా ఉండటంతో సందర్భం వచ్చినపుడు ఆ పార్టీ విధానాలపై కూడా మిగితా ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్షాలు తలోదారిలో నడుచుకొంటున్నాయి. దీంతో సంక్షేమ పథకాలు వంటి అస్త్రాలతో ముందుకెళ్తున్న అధికార వైసీపీకి ఎదురులేకుండా పోయింది. ఎక్కడైనా ప్రభుత్వం కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకొన్నా దానిని జనంలోకి సమర్థవంతంగా తీసుకెళ్లే పరిస్థితిలో ప్రతిపక్షాలు లేవన్న విమర్శవుంది. వైసీపీ రెండేళ్ల పాలన ముగిసే సమయంలో తిరుపతి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ప్రతిపక్షాలు ఇక్కడ శ్రమటోర్చిన ఆశించిన ఫలితం రాలేదు. ఓ రకంగా తిరుపతి ఉప ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ సాగింది. టీడీపీ కాస్త పోటీలో నిలిచిన బీజేపీ, జనసేన కూటమి, విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్, సీపీఎం పార్టీలు సైతం తన ప్రభావాన్ని ఈ ఎన్నికల్లో చూపలేకపోయాయి. రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ కలసి పోటీచేస్తే పరిణామాలు వేరుగా ఉండేవని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. విడివిడిగా, సొంత అజెండాతో వేర్వేరుగా ప్రతిపక్షాలు ముందుకెళ్లడంతో అవి ప్రజల్లో విశ్వాసం కలిగించలేకపోతున్నాయని కూడా వారు చెబుతున్నారు.
వాస్తవానికి 2004 ఎన్నికలకు ముందు దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు సుధీర్ఘ పాదయాత్ర చేశారు. దీంతో ఆయనకు జనం బ్రహ్మ రథం పట్టారు. అయినా 2004 ఎన్నికల్లో నాడు టీడీపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీలతో నాడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకొంది. ఆ కూటమి కూడా ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మెజార్టీ సట్లు నాడు కాంగ్రెస్ సాధించినా ఆ పార్టీతో సహా టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా నాడు కొంత లాభ పడ్డాయి. మరో మూడేళ్లలో ఏపీలోనూ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు నాడు కలసి ముందుకు నడుస్తాయా లేక సొంత బాటను ఎంచుకొంటాయా అన్నది వేచిచూడాల్సిందే.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: