జగన్ పాలనకు తిరుపతిలో సార్థకత లభించింది

వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో వైసీపీ గెలుపొందడంపట్ల.. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.. ఈ గెలుపు ముఖ్యమంత్రి వైఎస్ జాగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాభివృద్ధి పాలనకు సాక్షం అన్నారు. ఎక్కడైనా అధికార పార్టీకి ప్రజల్లో కొంత వ్యతిరేకత కారణంగా ఓట్లశాతం తగ్గుతుంది కానీ.. ఏపీలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో వైసీపీకి గతంకంటే ఎక్కువ ఓటింగ్ శాతం పెరగడం అంటే జగన్ పాలనకు సంపూర్ణ ప్రజామోదమే అని చెప్పారు. ఈ ఉపఎన్నిక ద్వారా 22 నెలల జగన్ పాలనకు సార్థకత లభించిందని అన్నారు. 

ఇక తిరుపతి లోక్ సభ ఎన్నిక విషయానికొస్తే గడిచిన 32 ఏళ్లలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, మూడు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకసారి తెలుగుదేశం మద్దతుతో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో అన్నింటికంటే కూడా నిన్న వచ్చిన మెజారిటీయే అత్యధికం అని ఏలూరి గుర్తుచేశారు. ఇంతటి భారీ విజయానికి జగనన్న ఒక్కరే సోలో ఓనర్ అన్నారు. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తి, ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అవ్వడం జగనన్న గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం.. ఈ సరికొత్త రాజకీయ ప్రస్థానంలో గురుమూర్తి లాంటి ఇంకెంతోమంది భవిష్యత్ లో మనకు కనిపిస్తారని డాక్టర్ ఏలూరి పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: