సెన్సార్ సన్నాహాల్లో

మగువా.. మజాకా

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     "వకీల్ సాబ్" చిత్రంలో మగువ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అలాగే... రీసెంట్ గా 'మగువ' పేరుతో విడుదలైన ఒక ఇండిపెండెంట్  చిత్రం ఓటిటి వేదికపై  విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం పాతిక లక్షలకుపైగా వసూలు చేసి అందరి దృష్టి ఆకర్షించింది. 

     ఇప్పుడు ఈ కోవలో రివెంజ్ థ్రిల్లర్ గా వస్తున్న చిత్రం "మగువా మజాకా". 'మగువ'లో టైటిల్ రోల్ ప్లే చేసి... ఆ చిత్రం సాధించిన సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన మధుప్రియ.. తాజాగా "మగువా మజాకా" అంటూ... ఆడదంటే అబల కాదు ఆది పరాశక్తి అని చాటబోతున్నారు.

     సంపత్ రాజ్ దర్శకత్వంలో స్వప్న మూవీస్ పతాకంపై కె.ఆర్.ఫణిరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని... ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు దుండగులపై ఓ మగువ ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుందన్నది క్లుప్తంగా కధాంశం.

     రవీంద్ర, రమేష్, క్రిష్, శాండీ, డి.ఎస్.రావు ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్: సంధ్య స్టూడియోస్, ఎడిటర్: వినోద్, కెమెరా: శ్రీను, సంగీతం: పవన్, నిర్మాత: కె.ఆర్.ఫణిరాజ్, రచన-దర్శకత్వం: సంపత్ రాజ్!!


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: