ఆ వక్ప్ భూమిని స్వాధీనం చేసుకొండి

వక్ప్ డిప్యూటీ సీఈఓకు డాక్టర్ ఏ.ఏ.ఖాన్ వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కబ్జాకు గురైన వక్ప్ స్థలాన్ని తిరగి స్వాధీనం చేసుకోవాలని వక్ప్ బోర్డ్ డిప్యూటీ సీఈఓ షఫీవుల్లాను  నల్గొండ ఎంఐఎం సభ్యులు డాక్టర్ ఏ.ఏ.ఖాన్ కోరారు. చౌటుప్పల్ హైవేలోని కోయల్ గుూడా అల్మాస్ మజీద్ కు చెందిన వక్ప్ ఆస్తులను కబ్జా చేశారని డిప్యూటీ సీఈఓ కు ఏ.ఏ.ఖాన్ తెలియజేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఈఓ దీనిపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వక్ప్ చెందిన 432 ఎకరాలకు సంబంధించి త్వరలో సర్వే చేయడానకిి సంబంధిత అధికార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ.ఏ.ఖాన్ మాట్లాడుతూ వక్ప్ భూములపై సర్వే చేయాలని స్థానిక ఎంఆర్ ఓకు ఆయన డిమాండ్ చేశారు. ఈ స్థలాలలో చట్టవిరుద్దంగా భవనాలు నిర్మించేందుకు వచ్చే వారికి ఎలాంటి అనుమతులు స్థానిక పంచాయతీ అధికార్లు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. 


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: