రాయల్ స్కూల్ ఆధ్వర్యంలో,,,

 రంజన్ ఈద్ కిట్ల పంపిణీ


కిట్లను పంపిణీ చేస్తున్న దృశ్యం 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రాయల్ స్కూల్ ఆధ్వర్యంలో రంజాన్ ఈద్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. నంద్యాల పట్టణం నడిగడ్డ నబినగర్ లోని రాయల్ పాఠశాల యందు శనివారం  తాహెరా హెల్త్ $ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని 350 ఈద్  కిట్లను రాయల్ పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ వి. యాకుబ్, తాపేర హెల్త్ & ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాద్యక్షులు ఖాజఉస్సేన్, పాఠశాల కరస్పాండెంట్ ఇషాక్ వలిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరత్ అబ్దుల్ హది, హజరత్ సలాం, నవభారత్ స్కూల్ కరస్పాండెంట్ హుసేన్, సాయివాణి స్కూలు కరస్పాండెంట్ హుసేన్ బాషాలు పాల్గొన్నారు. పాఠశాల వ్యవస్థాపకులు యాకూబ్, కరెస్పాండెంట్ ఇషాక్ వలిలు ముట్లాడుతూ

 

పవిత్రగ్రంధం ఖురాన్ ప్రకారం ప్రతి మనిషి తన సంపాదనలో 2% జకాత్ తీసి పేదలకు సహాయం చేస్తే దాదాపు పేదరికం అనేదే లేకుండా చేయవచ్చన్నారు. ఈ పవిత్ర ఖురాన్ బాటలో బాగంగా ఈ రోజు 350 ఈద్ కిట్లను పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్య అతిధులు అబ్దుల్ హాది, సలాం, నవభారత్ హుసేన్ తదితరులు  మాట్లాడుతూ రాయల్ పాఠశాల యాజమాన్యం గత 9 సంవత్సరాలుగా నిరుపేదలు  అందరిలాగే సుఖ సంతోషాలతో రంజాన్ పండుగ జరుపుకోవాలనే దృకృదంతో 350 ఈద్ కిట్లను పంచినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహిమాన్,  యూసూఫ్, అన్వర్ బాష, బఫిరున్, షాహిన్, ఫర్జానాతో పాటు  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: