నిరాడంభరంగా,,
బాజీ బాబా ఉరుసు మహోత్సవం
(జానోజాగో వెబ్ న్యూస్-గుంటూరు ప్రతినిధి)
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన పెదకాకని బాజి బాబా గారి 533 ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ వారి ఉత్తర్వులు మేర కోవిడ్ నియమ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ భక్తుల మనోభావాలకు ఎక్కడ ఇబ్బంది కలుగకుండా దర్గా ఎగ్జిక్యూటివ్ అధికారి, గుంటూరు జిల్లా వక్ఫ్ ఆడిట్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం బేగ్ పర్యవేక్షణలో దర్గా గుమస్తా సత్తార్, ఇమాంలు పాల్గొన్నారు.
ఉరుసు ఉత్సవంలో భాగంగా గుసుల్ కార్యక్రమంతో పాటు గంధం అలంకరణ, ప్రార్థన (ఫతేహ) లు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వక్ఫ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రతి ఏటా కొన్ని లక్షల మంది పాల్గొనే ఈ కార్యక్రమం ఇలా జరగడం చాలా బాధాకరం గా ఉందన్నారు. త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోన మహమ్మారి నివారణకు తీసుకుంటున్న చర్యలు ఫలించి రాష్ట్రం మొత్తం సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యలతో ఉండాలని ఈ సందర్భంగా బేగ్ కోరారు.
Post A Comment:
0 comments: