కరోనా పై యుద్ధ ప్రతిపాదిక చర్యలు చేపట్టలా

హిందూపురం అఖిలపక్షం డిమాండ్


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం ప్రాంతంలోని అఖిలపక్ష పార్టీల సమన్వయ కమిటీ సమావేశం  అఖిలపక్ష కార్యాలయంలో బాలాజీ మనోహర్ అధ్యక్షతన  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా పై ప్రభుత్వాలు  బాధ్యత గా వ్యవహరించాలని  అనేక సమస్యలు పరిష్కారం చేయాలన్నారు కరోనా బాధితులకు మానసికంగా ధైర్యంగా ఉండాలని మనో నిబ్బరంగా ఉండి వైద్యుల చూచనలు పాటిస్తూ మంచి ఆహార ఆరోగ్య నియమాలు పాటిస్తేనే కరోనా పై విజయం సాదించవచ్చునన్నారు అఖిలపక్షం ఆధ్వర్యంలో  రేపు.06.5.2021 న  ఉదయం 10 గంటలకు తూముకుంట లోని ఆక్సిజన్ ప్లాంట్ వద్ద  ఆక్సిజన్ కొరత తీర్చాలని ప్లే కార్డులను ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం  చేపట్టనున్నట్లు తెలిపారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం ఆక్సిజన్ కొరత తీర్చాలని  ఆసుపత్రుల్లో పడకలు  పెంచాలని అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమం  వేగవంతం  చేయాలన్నారు అలాగే ప్రభుత్వం కు పలు సమస్యలను డిమాండ్ చేశారు 

1. ప్రతి మండలంలో కనీసం మూడు కరోనా టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఫలితాలు 24 గంటల్లోపు ఇవ్వాలి.

2. ప్రతి మండలంలో వంద పడకల తో కూడిన  క్వారంటిన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని సెంటర్ లో పెట్టాలి.

3. ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ లలో ఆక్సిజన్ కొరత లేకుండా వీలైనంత ఎక్కువ నిలువ ఉంచుకోవాలి.

4. ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి బిల్లును తక్షణం చెల్లించాలి.

5. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి గ్రస్తులకు సహాయార్థం బియ్యం , పప్పు  , ఉప్పు ,  చింతపండు వంటి వంట సరుకులు ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. 6కరోనా మహమ్మారి తో మరణించిన బాధిత కుటుంబానికి 10లక్షల ఎక్సగ్రీషియా ప్రకటించాలి .మానవతావాదులు ,  దాతలు అందరు కూడా సహకరించి అఖిలపక్ష కమిటీకి సహాయ  , సహకారాలు అందించాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో  కన్వీనర్ ఇంతియాజ్ ,బాలాజీ మనోహర్, బీఎస్పీ శ్రీరాములు, టీడీపీ డి.ఇ.రమేష్ కుమార్, ఆర్సీపీ శ్రీనివాసులు, ముస్లిం నగారా ఉమ్మర్ ఫారూఖ్, సీఐటీయూ వెంకటేష్, రాము ,పెద్దన్న , ఎస్ఎఫ్ఐ నాయకులు బాబావలి నాయకులు అమానుల్లా, సమీవుల్లా, దుర్గా, నవీన్, దాదాపీర్, అంజాద్,  ఫయాజ్,   ఇబ్రహీం, నూరుల్లా ముజ్జు టిప్పు బ్రిగేడ్ అతీఖుర్రహమాన్అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష కమిటీ నాయకులు  , ప్రజా సంఘాలు  , స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: