ఆంధ్రకేసరి తెగువ,,,

యావత్ భారతానికి ఆదర్శం

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి  టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఘననివాళులు అర్పించారు. ఈ ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..  స్వతంత్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ యావత్ భారతావనికి ఆదర్శప్రాయమని అన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ధైర్యముంటే కాల్చండి అంటూ నినదించిన ధీరోద్ధాత్తుడు ఆంధ్రకేసరి అని ఏలూరి కొనియాడారు.
తమిళ పాలకుల చెరనుంచి విముక్తి కోసం చేసిన ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ప్రకాశం పంతులు గారి కృషి మరువలేనిది అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన విధానం చారిత్రాత్మకం అన్నారు. ఎవరెన్ని విధాల వంచించినా ప్రజలను నమ్మి తన సర్వస్వాన్ని ధారపోసిన త్యాగమూర్తి అని.. ఆంధ్రుల అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమానత్యాగనిరతికి ప్రతినిధి అని.. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడానికి పంతులు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని డాక్టర్ ఏలూరి చెప్పారు. ఆయన జీవితకాలం త్యాగం తోనే అహర్నిశలు కష్టపడి రాష్ట్రం కోసం, ప్రజల కోసం చివరి నిమిషం వరకు పోరాడి సేవలందించిన ఆ మహనీయుని ఒకసారి స్మరించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్టు డాక్టర్ ఏలూరి విజ్ఞప్తి చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: