కరోనా కాటుకు,,,
మరో జర్నలిస్ట్ మరణం
(జానోజాగో వెబ్ న్యూస్-అల్లవరం ప్రతినిధి)
కోనసీమలోని అల్లవరం మండలానికి ఆంధ్రభూమి రిపోర్టర్ గా చాలాకాలం సేవలందించిన మంచి మనిషి శంకర్రావ్ మరణించారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న తోటి జర్నలిస్టులు ఆయన గురించి ఇలా స్మరించుకొంటున్నారు. కరోనా కారణంగా మనకు దూరమయ్యాడు. అమలాపురానికి నేను స్టాఫరుగా పనిచేస్తున్న టైంలో.. వీడినుంచి రోజూ నేను వినే మాటొక్కటే. 'ఏవండిబాబు, ఎనిమిది వార్తలంపితే.. ఒక్కటెట్టేరా' అని. ఫలితాన్ని ఆశించకుండా పనిమీద దృష్టిపెట్టే చాలామంది రిపోర్టర్లలో వీడొకడు. అక్కడ నేను పనిచేసిన కాలంలో ఆత్మకు దగ్గరగా, ఆత్మలో ఆత్మలా కలిసిపోయిన వాళ్లు చాలామంది మిత్రులే ఉన్నారు. వాళ్లలో వీడిది ఒకింత ప్రత్యేకస్థానం. ఎంత వత్తిడివున్నా.. పని విషయంలో ఎప్పుడూ నింపాదిగా, తాపీగావుండే శంకర్రావ్ ప్రాణం విషయంలో తొందరపడి మాకు అన్యాయమే చేశాడు. పనికి సంబంధించి శిష్యుడిని, బతుక్కి సంబంధించి గురువుని కోల్పోయాను. వీడి దగ్గర నేను నేర్చుకున్న చిన్నిపాఠం 'అమాయకత్వమంటే తెలీనితనం కాదు. అన్నీ తెలిసినవాళ్లకంటే మెట్టు పైనుండటం అని. వాడి ప్రాణం ఇప్పుడు వాడు నేర్పిన పాఠంలోనే ఉంది. అని శంకర్రావ్ ఆప్తులు ఆయన్ని తలుచుకొంటున్నారు.
Post A Comment:
0 comments: