భారత్ కు...నిరుద్యోగం పెను సమస్య

పనిచేసే యువత భారతదేశానికి ఓ పెద్ద ఆర్థిక శక్తి

అయినా ఉపాధి అవకాశాలేక ఢిల్లా పడుతున్న భారతదేశం

కొత్త పరిశ్రమలు రాకపోయే...ఉన్నవి ఉడిపోయే


నిరుద్యోగం మానవజాతి మనుగడ ఉన్నంతవరకు వినిపించే పదం.  నిరుద్యోగం ఎక్కువగా ఉన్న దేశం సంక్షోభం,దారిద్రం  దిశగా పయనిస్తోంది . మన దేశంలో జనాభా విస్ఫోటనం కారణంగా  నిరుద్యోగం ఎప్పుడు రగులుతున్న రావణకాష్టం లాగా ఉంటుంది .  సెంటర్ ఫర్ మోనటరింగ్  ఇండియన్ ఎకానమీ సంస్థ (సి ఎం ఐ ఈ) ప్రకారం మన దేశంలో నిరుద్యోగానికి నిర్వచనం ఏమిటంటే  15 సంవత్సరాలు  దాటినా ఒక పురుషుడు /స్త్రీ  ఉద్యోగం లేని, మరియు ఉద్యోగం చేయడానికి ఇష్టపడని ,లేదా చురుకుగా ఉద్యోగం కోసం వెతకటం లేదు ఏదైనా ఆర్థిక కార్యకలాపాల్లో పనిచేయడానికి ఆసక్తి లేని వ్యక్తిని "నిరుద్యోగి” అంటారు. ప్రపంచ వ్యాప్తంగా పనిచేయగలవారు సగటున 61 %కార్మిక శక్తి ఉంది . మన దేశంలో పనిచేయగలవారు 64 %కార్మిక శక్తి ఉంది .  మన దేశంలో 105 కోట్ల మంది 15 సంవత్సరాలు కంటే పైబడినవారు ఉన్నారు. 100 % పట్టభద్రుల్లో 60 %పనిచేయటానికి సిద్ధంగాఉన్నరు వీరిలో 26 % మందికి పనిలేదు. మన పట్టభద్రుల్లో యువకులు 20 -24 మధ్య 46 % నిరుద్యోగం ఉంది ,25 -29 వయసులో 15 %నిరుద్యోగం ఉంది,30 -34 మధ్య 6 %,45 -64మధ్య  2 %నిరుద్యోగం ఉంది . మన దేశం లో బాలకార్మిక వ్వవస్థ వేళ్లూనులుకునిఉంది. మన దేశ పిల్లలు బాలకార్మికులుగా పనిచేస్తుంటే దేశ భవిషత్తు ఏమవుతుంది. దీని గురించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

 70 వ దశాబ్దంలో నిరుద్యోగం పై సినిమా పాటలు బాగా చిత్రీకరించేవారు . బి.ఎ, ఎం.ఎ, బి.ఎస్సి ,ఎం .ఎస్సి చదివిన హీరో కి మాత్రం ఎక్కడ ఉద్యోగం దొరకదు. ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో  వారి రక్తాన్ని వారి యాజమాన్యం పీల్చుకుంటుంది . ఇప్పుడు 2006 సంవత్సరం తరువాత  బి. టెక్ ,ఎం.టెక్ , పీహెడీ, ఎం.బి.ఎ  చేసినవారు కూడా ఉద్యోగ అన్వేషణలో చాలా కష్టాలు పడుతున్నారు. చివరకు విరంత ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనకొరకు ఎదురుచూస్తూ ,కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు .అటు ఉన్న ఊరిలో తల్లిదండ్రులకు భారమై, ఇటు నగరాలలో చాలీ చాలని పైసలతో పస్తులుంటున్నారు. విచిత్రం ఏమిటంటే  పీహెడీ చేసిన నిరుద్యోగులు హోమ్ గార్డ్ ,కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారంటే నిరుద్యోగం తీవ్రత ఏవిధంగా ఉందొ అర్ధమౌతుంది.

ఇక అచ్చే దిన్ వచ్చాక మోడీ ప్రభుత్వం సవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానన్నారు. ఉద్యోగాలు దొరకకా నిరుద్యోగులు నిరసనలు  తెలుపుతే చాయ్, పకోడీలు అమ్ముకోమని మోడీ గారి ఉచిత సలహ ఇచ్చారు .ఇక అర్ణబ్ గోస్వామి ,సుదీర్ లు  టీవీ ల పై నిరుద్యోగులను అర్బన్ నక్సలైట్స్ గా చిత్రీకరిస్తున్నారు. జనాభా విస్ఫోటనం వలన దేశంలో 2018 సంవత్సరం నుంచి పని చేయగల యువ శక్తి 15 -64 సంవత్సరాలు మధ్య ఉన్నారు .విరి సంఖ్య పని చేయని వారి కంటే ఎక్కువగా ఉంది.15 సంవత్సరాలు కంటే తక్కువ 64 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు  రానున్న 30 సంవత్సరాలలో పనిచేసే యువ శక్తి కంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచం లో అత్యంత పనిచేయగల యువ శక్తి భారతదేశంలోనే ఉంది. ఇలాంటి యువ శక్తి అసియా ఖండ దేశాలు అయిన జపాన్ ,చైనా ,దక్షిణ కొరియా ,సింగపూర్ లు బాగా పరిశ్రమలు స్థాపించి అక్కడి యువతకు ఉన్నత ఉద్యోగాలు కల్పించారు. దీనితో  వారి జీవన ప్రమాణాలు అంత ఉన్నత స్థితికి  చేరుకొన్నాయి . వారి నవతరానికి మంచి పౌష్ఠిక ఆహరం, నైపుణ్యాలతో కూడిన విద్య , సమాన అవకాశాలు ,పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ రోజు ఇ దేశాలు ప్రపంచ మార్కెట్ లను  శాశిస్తున్నాయి. 

 


కానీ మన దేశం లో 2014 నుంచి స్థిరమైన ప్రభుత్వం ఉన్న యువ శక్తికి సరైన దిశా ,దశ నిర్దేశం చేయలేకపోతోంది. మేక్ ఇన్ ఇండియా ,మేడ్ ఇన్ ఇండియా ,స్టార్టుప్ ఇండియా, స్కిల్ ఇండియా  లాంటి నినాదాలకు పరిమితమైయింది,  ప్రణాళిక సంఘం ను నితి ఆయోగ్ ను, జి ఎస్ టి లాంటి మార్పులు చేసింది. మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత నుంచి "మతం" తప్ప మరే ఎజండా లేదు . భారతదేశాన్ని మోడీ  5 ట్రిలియన్  ఎకానమీ గా తీర్చిదిదుతా అన్నారు, వాస్తవంగా చూస్తే భారత దేశంలో నిరుద్యోగం దీని ప్రభావం ఎలా  ఉంటుందో సెంటర్ ఫర్ మోనటరింగ్  ఇండియన్ ఎకానమీ సంస్థ వారు 5 సంవత్సరాల అధ్యనం ప్రకారం మే 2016 నుంచి ఫిబ్రవరి 2021 డేటా ప్రకారం, మే 2016  లో 94 కోట్లమంది పనిచేయగల యువశక్తి ఉంది ,ఇ ఐదు సంవత్సరాలలో ఫిబ్రవరి 2021 లో 105 కోట్లమంది పనిచేయగల యువశక్తి గా, 11 కోట్లమంది  పెరిగింది . మే 2016 లో 94 కోట్లమంది పనిచేయగల యువశక్తి లో 46  కోట్లమంది మాత్రమే ఉద్యోగాలలో ఉన్నారు .మిగిలిన 48 కోట్లమంది ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు లేదా  పని చేయకుండా ఉన్నారు . 105 కోట్లమంది లో42 కోట్లమంది పనిచేయగల యువశక్తి ఉంది. మిగతా 63 కోట్లమంది ఉద్యోగ వేటలో ఉన్నారు . (సి ఎం ఐ ఈ) లెక్కలప్రకారం ప్రతి 4 లో ఒకరు నిరుద్యోగిగా ఉంటున్నారు, ఇదేదో కరోనా కారణం వల్ల  జరిగినది  కాదు. యువతలో నిరుద్యోగం పెరిగి వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు ,మోడీ ఉద్యోగాలు కల్పించండి అని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. 

ఇంజీనీరింగ్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్న వాటిని అందుకోవటానికి మన విద్యార్థులు సరైన నైపుణ్యాలు లేవు .2003జాతీయ ఉపాధికల్పన నివేదిక మరియు యూ వీ రావు నివేదిక  ప్రకారం 90 %విద్యార్థులకు సరైన నైపుణ్యాలు లేవు .దీనికి కారణం పుట్టగొడుగుల్లా ఇంజీనీరింగ్ కళాశాలలు పుట్టుకొచ్చాయి .మన తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియాంబర్స్ మెంట్ వల్ల లక్షల్లో ఇంజీనీర్లు తయారయ్యారు . దేశం మొత్తం మీద ఏ ఐ సి టి ఈ  1 .67 లక్షల సీట్స్ ను రద్దుచేసింది. ఇక మెడికల్ కాలేజీల మాఫియా గురుంచి చెప్పనక్కరలేదు ఒకొక్క  ఎన్ ఆర్ ఐ సీట్ కి 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీ లన్ని మనీ కాలేజీగా మారిపోయాయి, ఇన్ని కోట్లు పెట్టి చదివి ఈ వైద్యులు రోగుల రక్తాన్ని ఎంతగా పేల్చుతారో, వైద్య విద్యా ఇపుడు చాల ఖర్చుతో కూడుకొన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 57 % వైద్యుల దగ్గర సరైన వైద్య అనుభవంలేదు. ప్రతి 1700 మందికి ఒక డాక్టర్ మాత్రం ఉన్నాడు .మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా లెక్కల ప్రకారం 10 లక్షల డాక్టర్లు నమోదు చేసుకుంటే వారిలో కేవలం లక్ష మంది మాత్రమే మెడికల్ ప్రాక్టీస్ చేయటానికి అర్హత సాధిస్తున్నారు . దేశంలోని 5 వేల మానేజ్మెంట్ కాలేజీల నుంచి 2 లక్షల ఎం బి ఏ లు ఉద్యోగవేటలో ఉన్నారు .అసోచామ్ నివేదిక ప్రకారం 7 %మాత్రమే ఉద్యోగాలకు అర్హత కలిగివున్నారు .ప్రపంచంలో నిరుద్యోగం పెరగటానికి యాంత్రీకరణ అని చెప్పవచు . కానీ టెక్నాలజీ మార్పులను మానవులు అంగీకరించక తప్పదు టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి.

2030 నాటికీ యాంత్రీకరణ వల్ల ప్రపంచంలో 800 మిలియన్స్ ఉద్యోగకు పోతాయి. కృత్రిమ మేధా, డేటా సైంటిస్ ,బ్లాక్ చైన్ ,క్లౌడ్ కంప్యూటింగ్, త్రి డి ప్రింటింగ్ వంటి టెక్నాలజీ ద్వారా కొత్త ఉద్యోగాలు కల్పించిన అప్పటి జనాభాకు ఈ ఉద్యోగాలు సరిపోవు .మనదేశంలో నిరుద్యోగానికి కారణాలు ,విద్యా విధానాలు, పాలసీలు ,విద్యా వ్యవస్థ ,నైపుణ్యాలకొరత ,మొదలగున్నవి .ఏది ఏమైనా యువత తమ తరంలో వారి నైపుణ్యాలను పదునుపెట్టుకోవాలి అప్పుడే ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు . నిరుద్యోగుల కొరకు ఉపాధి అవకాశాలను కల్పించటానికి మోడీ ప్రభుత్వం ఎంచర్యలు తీసుకుంటుంది . ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎందుకు కల్పించటంలేదు ,ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ ఎందుకు విస్మరిస్తోంది .ప్రైవేట్ రంగం వైపు ఎందుకు అడుగులు వేస్తుందో ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు ప్రైవైట్ పరం చేస్తుందో  యువత  ప్రశ్నించాలి. ప్రభుత్వ పని కేవలం పరిపాలించటమేనా ? మరి జాతి నిర్మాణాన్ని ఎవరు చేపట్టాలి ?

 మన దేశంలో నాణ్యమైన విద్య లేకపోవటం యూనివర్సిటీ ల నుంచి అనేకమంది డిగ్రీలు పట్టుకొని బయటకు వస్తున్నారు,ఇప్పుడు చదువుకొన్న నిరుద్యోగులు తయారవుతున్నారు. యువ శక్తి  కి  ఉపాధి అవకాశాలను కల్పించటానికి మన ఆర్ధిక వ్యవస్థను పటిష్ఠపరచాలి. చదువుకొన్న యువత ద్వారానే ఉద్యోగాలు కల్పించబడుతాయి. యువత కేవలం ఉద్యోగాలకే కాకా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.కాబట్టి వీరికి సరియన మార్గనిర్దేశం చేయాలి. అప్పుడు దాని ఫలితం కొన్ని సంవత్సరాల తరువాత కనిపిస్తుంది .భారత ప్రభుత్వం జి డి పి లో విద్య పై కేవలం 3 % మాత్రమే ఖర్చు చేస్తుంది .అదే అభివృద్ధి చెందిన దేశాలు 8 % పై గా ఖర్చు చేస్తున్నాయి .మన దేశం లో డిగ్రీ లు ఇచ్చే ఫ్యాక్టరీస్ ఐన యూనివర్సిటీ లను ఎప్పటికప్పుడు ప్రపంచ పోకడననుసరించి నైపుణ్యాలతో తీర్చిదిద్దాలి .ప్రస్తుతం మన యువతకు ఉద్యోగావకాశాలు కలవు,కానీ వాటిని అందుకోవటానికి ,అర్హతలు ,శక్తి సామర్ద్య్హలు,నైపుణ్యాలు లేవు .స్త్రీ  శక్తిని కూడా భాగస్వామ్యం చేయాలి . మన దేశంలో స్త్రీ శక్తి కేవలం 12 % మాత్రమే ఉద్యోగాలు చేయటానికి సిదంగాఉన్నారు ,కానీ వారికీ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి . కారణం మన దేశలో వివక్ష  సంప్రదాయాలు మొదలగున్నవి . 

2021  ఏప్రిల్ 11 తో ముగిసిన వారంలో నిరుద్యోగం ఏకంగా 8 .58 % కి ఎగసి 15  వారాల గరిష్ట స్థాయికి చేరింది. గడచినా వారంలో పట్టణప్రాంతాలలో నిరుద్యోగం 260 బేసిక్ పాయింట్స్ పెరిగి 9 .81 %చేరింది .మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో 8 .58 నుంచి 8 %తగ్గటం విశేషం .ఇంతక్రితం జనవరి 31 తో ముగిసిన వారంలో నిరుద్యోగం గరిష్ట స్థాయి 8 .84 %గ ఉంది .గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వల్ల మే 3 నాటికీ దేశంలో నిరుద్యోగరేటు 27 .11 % నమోదైంది .క్రమంగా ఆర్ధిక వ్వవస్థ కోలుకోవటంతో ఈ ఏడాది జనవరి 4 నాటికీ ఇది 4 .66 % తగ్గింది .దేశ జి డి పి  2020 -21 ఆర్ధిక సంవత్సరానికి -8 % గా నమోదు అయింది. ప్రపంచీకరణలో భాగంగా దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగా నిరుద్యోగం కూడా పెరిగింది కరోనా కారణంగా మన దేశ ఆర్ధిక వ్యవస్థ ఎప్పటికల్లా కుదుటపడుతుందో ప్రస్తుతానికి తెలియదు.దేశం లో అన్ని దశలలో అంతరాలను తగ్గించి ,అందరికి సమన అవకాశాలను కల్పించాలి, అప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన దేశం గా ప్రపంచ పటంపై తన ఉనికిని చాటుకొంటుంది.

✍️ రచయిత-జియాఉద్దీన్ ముహమ్మద్ 

సెల్: 9989236393

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: