ఈటల రాజేందర్ పై రాజద్రోహం నేరం

రాజ్యాంగపు ప్రమాణాలకు తూట్లు

మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని భూముల కబ్జా

ఆ తరహా కేసుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ ఈ పదవిని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు రాజద్రోహ నేరం మోపేందుకు  రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో దేశంలోని రాజ్యాంగం పైన, శాసనాల పైన నమ్మకం ఉంచి, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా, మంత్రిగా పని చేస్తానని ప్రమాణం చేసి దానికి భిన్నంగా మంత్రి పదవి అడ్డుగా పెట్టుకుని అక్రమంగా భూకబ్జాలకు పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను క్రోడీకరించి రాజ్యాంగం పై చేసిన ప్రమాణాలను తుంగలోకి తొక్కిన అంశం పై రాజ ద్రోహం కింద కేసులు పెట్టేందుకు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను అక్రమంగా లాక్కునేందుకు మంత్రి పదవిని అడ్డంగా వాడుకుని ఇబ్బడిముబ్బడిగా సంపాదించినట్లు ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం రాజ్యాంగంపై ప్రజా ప్రతినిధులు చేసే ప్రమాణాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అ ప్రథమ పౌరుడైన గవర్నర్ ముందే రాజ్యాంగంపై చేసిన ప్రమాణాలను సదరు మంత్రి  ఆచరించక పోవడంతో పాటు ఉల్లంఘనకు పాల్పడటం రాజ ద్రోహం కింద పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయమై ప్రభుత్వంలోని న్యాయనిపుణులు సీఎం కేసీఆర్ కు సలహాలు కూడా ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇస్తే వాటిని ఇచ్చిన అవసరం నిమిత్తం వాడుకోవాల్సి ఉంటుంది.

అయితే పేదలు వారికి కేటాయించిన అసైన్డ్ భూములను అమ్ము కొనుటకు వీలు లేదు. అలాగే ఈ భూములను కొనుగోలు చేయడం కూడా నేరమే. ఈ విషయాలు అన్నీ తెలిసిన సదరు మంత్రి పేదల భూములను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని దురుద్దేశంతో మంత్రి పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టమవుతుందని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అందించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దాదాపు 60 ఎకరాలు అసైన్డ్ భూమి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు కబ్జాలు చేసి స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించడంతో దీనిపై కూడా ఈటల రాజేందర్ పై కేసు నమోదు చేసి చట్టపరంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

... స్వయంగా తానే ఒప్పుకున్న ఈటల 

అసైన్డ్ భూములను తమ హెచ్చరిష్ కు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను అడిగానని ఈటెల రాజేందర్ మీడియా ముందు ఒప్పుకోవడం ఆయనకు మరింత ఉచ్చు బిగించేందుకు దోహదపడుతుంది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయరాదు అని తెలిసిన మంత్రి నేరుగా అధికారులను ఆ భూములను తమకు కేటాయించాలని కోరడం స్వార్థంతో కూడుకున్న చర్యగా ప్రభుత్వ వర్గాలు అభివర్ణిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని కేటాయించడం లేదా...? దాని ప్రకారం గా  తమ  హెచరీస్ కు ఇస్తే తప్పేంటి అని మీడియా ముందు చెప్పటం వల్ల అడ్డం గా బుక్ అయ్యిపోయిన ట్లు తెలిసింది.ఇలాంటి రాజద్రోహ కేసులు పెడితే భవిష్యత్ లో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మసులుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: