కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలు

ఆగ్రహించిన అఖిలపక్షం

ఆక్సిజన్ తయారీ కేంద్రాల వద్ద అఖిలపక్షం నిరసనలు

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం కరోనా రోగులు కు ఆక్సిజన్ సరఫరా విషయంలో  అధికారులు  ప్రభుత్వ యంత్రాంగం సమన్వయం తో పనిచేయాలని  ఆక్సిజన్ తయారీ కేంద్రాలు వారు ప్రథమ  ప్రాధాన్యత ఇచ్చి  సరఫరాలో ఎక్కడ  అవాంతరాలు లేకుండా కొరత లేకుండా సకాలంలో కరోనా రోగులకు ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేసుకోవాలని తమ ప్రాంతంలో తయారీ కేంద్రాల్లో సంవృద్దిగా ఆక్సిజన్ లభిస్తుంటే ఇతరత్రా కారణాలు తో ఆక్సిజన్ కొరత సరఫరాలో ఇబ్బందులు  సృష్టిస్తే సహించేది లేదని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు గత 3 రోజుల  క్రితం హిందూపురం  ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన  ఘటనలు  పునరావృతం కాకూడదని నేపధ్యంలో  అఖిలపక్షం ఆధ్వర్యంలో బీఎస్పీ శ్రీరాములు అధ్యక్షత న  బుధవారం నాడు స్థానిక తుమకుంట పారిశ్రామిక వాడలో ఆక్సిజన్ తయారీ కేంద్రాలను సందర్శించారు  ఆక్సిజన్  ఉత్పత్తి , సరఫరా  వివరాల ను అడిగి తెలుసుకున్నారు.
  హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి ఆమడ దూరంలో తయారీ కేంద్రాలు వున్నా కూడా ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోయారని ఇది ఎంతో విచారమని ఇలా ఎప్పటికీ జరగకుండా తయారీ కేంద్రాల వారు హిందూపురం కు తర్వాత అనంతపురము జిల్లా కు సరిపడే ఆక్సిజన్ ను  అందించేలా చర్యలు మానవతా దృక్పధం తో చేపట్టాలన్నారు కరోనా ను అదనుగా చేసుకొని కర్ణాటక రాష్ట్రాలకు బ్లాక్ మార్కెట్ కి పాల్పడితే ప్రతిఘటిస్తామన్నారు  తయారీ కేంద్రాల వారు ఉత్పత్తుల కు అవరోధాలు ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ అధికారులు సహకారం అందిస్తారని ఆక్సిజన్ సరఫరాలో  తయారీ కేంద్రాల వారు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఆనంతరం వారు తయారీ కేంద్రం వద్ద ప్లే కార్డులు తో నిరసనలు చేశారు ఆక్సిజన్ సరఫరాలో నిర్లక్ష్యం వద్దు, హిందూపురం కరోనా రోగులు కి సరిపడా ఆక్సిజన్ ను సరఫరా చేయాలి ,అని నినాదాలు చేశారు తయారీ కేంద్రాల వారు హిందూపురం ప్రాంతంలో ఆక్సిజన్ కొరత రాకుండా అప్రపత్తమై ఉత్పత్తులు పెంచి సకాలంలో ఆక్సిజన్ ను అందించాలని  విన్నవించారు. ఈ సమావేశంలో  కన్వీనర్ ఇంతియాజ్ ,బాలాజీ మనోహర్, బీఎస్పీ శ్రీరాములు, టీడీపీ నాయకులు డి.ఇ. రమేష్ కుమార్,   ముస్లిం నగారా ఉమ్మర్ ఫారూఖ్ ఆర్సీపీ శ్రీనివాసులు, సీఐటీయూ వెంకటేష్  దుర్గా నవీన్ పెద్దన్న  ,రాము మాజీ సర్పంచ్ హెచ్ఎన్ రాము  కార్మిక సంఘం నాయకులు రవి కుమార్, ఎస్ఎఫ్ఐ బాబావలి, ఎంఎస్ఎఫ్ రవికుమార్  హరికుమార్  నరసింహులు అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష కమిటీ నాయకులు  , ప్రజా సంఘాలు  , స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొనడం జరిగింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: