నోముల భగత్ గెలుపు పట్ల,,,
టీఆర్ఎస్ లీగల్ సెల్ హర్షం
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ గెలుపు పట్ల తెరాస పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చి, నృత్యాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారనీ, ప్రజల ఆకాంక్ష మేరకు తెరాస పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ ను గెలిపించారని అన్నారు. తొలిసారి బరిలో దిగి అనూహ్యంగా అధిక మెజారిటీతో విజయం సాధించి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేసే భాగ్యం పొందడం సంతోషం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస పార్టీ నేతలు, కార్యకర్తలు, న్యాయవాదులు గెలుపు కోసం విశేష కృషి చేశారని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి పై గెలుపు సాధించడం విశేషమని కొనియాడారు.
యువ న్యాయవాదిగా, తెరాస పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయఢంకా మోగించి అందరి దృష్టిని ఆకర్షించాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహం ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించిన బిజెపి సాగర్ ఎన్నికలో ఖంగుతిన్నారు. మూడో స్థానంలో నిలిచి సరిపెట్టుకుంది. పదివేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ విజయం పట్ల న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. రాబోవు వరంగల్, ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ తెరాస పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, ఉపేంద్ర, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: