సత్వర వైద్యానికి చర్యలు తీసుకోండి
తెలంగాణ న్యాయవాదుల మండలి సభ్యులు డిమాండ్
రాష్ట్రంలో కోవిడ్ బారిని పడుతున్న న్యాయవాదుల సత్వర వైద్యానికి వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ న్యాయవాదుల మండలి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో కోవిడ్ ఉదృతి, అనేకమంది న్యాయవాదుల మరణాలు, వైద్యం కోసం న్యాయవాదులు పడుతున్న కష్టాల గురించి ప్రజా వైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావుకు తెలంగాణ న్యాయవాదుల మండలి సభ్యులు కొండారెడ్డి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో న్యాయవాదులకు కోవిడ్ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్య శాఖ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని ఆ వినతి పత్రంలో ఆయన కోరారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: