కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మిక లోకానికి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పురోగతికి ఆర్థిక అభివృద్ధికి శ్రమజీవుల పాత్ర ఎంతైనా ఉందని ఆయన కొనియాడారు. అలాంటి కార్మికుడు బాధపడే రోజు ఎన్నడూ రాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రమజీవుల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన సూచించారు. పరిశ్రమలు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు. అసంఘటిత రంగంలో కార్మికులుగా ఉన్న వారికి కూడా కార్మిక చట్టాలు వర్తించేలా చట్ట సవరణ అవసరమన్నారు. ఈ  అసంఘటిత రంగంలో ఎక్కువగా ముస్లింలే కార్మికులు గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరి రక్షణ కోసం ప్రత్యేక కార్మిక చట్టాలను తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: