సింగపూర్ నుంచి ద్రవరూపంలో ఉన్న మెడికల్ ఆక్సిజన్‌ను
వైజాగ్ నౌకాశ్రయంలో అందుకున్న ఇండియన్ ఆయిల్
(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)
లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)తో నింపబడిన 11 ఐఎస్ఓ ట్యాంక్‌లతో కూడిన కన్సైన్మెంట్ను ఇండియన్ ఆయిల్ సంస్థ నేడు విశాఖపట్నం నౌకాశ్రయంలో అందుకుంది. సింగపూర్ నుంచి ఈ ఎల్ఎంఓను ఇండియన్ నేవీ నౌక ఐఎన్ఎస్ జలాశ్వ తీసుకువచ్చింది. ఇదే నౌక గెయిల్ సమకూర్చిన మరో రెండు ఐఎస్ఓ ట్యాంక్‌ల ఎల్ఎంఓను సైతం తీసుకువచ్చింది. దీనిని సైతం ఇండియన్ ఆయిల్ నిర్వహించింది. ఈ మొత్తం కన్సైన్మెంట్ను ఇండియన్ ఆయిల్ సంస్థ M/s బీఎన్ఎఫ్ సింగపూర్ వద్ద సేకరించడంతో పాటుగా దీనిని సింగపూర్‌లోని M/sలిండే వద్ద పూరించింది. ఈ ఐఎస్ఓ ట్యాంక్లనుకోవిడ్ మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో సహకరించేందుకు వీలుగా ఎల్ఎంఓ సరఫరా మరియు రవాణా కోసం ఇండియన్ ఆయిల్ సంస్థ లీజుకు తీసుకుంది. ఈ కన్సైన్మెంట్ ద్వారా వచ్చిన ఆక్సిజన్‌ను తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు వినియోగించనున్నారు.
ద్రవరూపంలోని వైద్య ఆక్సిజన్ కోసం డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో పాటుగా రవాణా సమస్యలు కూడా ఎదురవుతున్న వేళ, ఇండియన్ ఆయిల్ సంస్థ, కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ మార్గనిర్దేశకత్వంలో వైద్య పరమైన ఆక్సిజన్ రవాణాకు అనువుగా ఉండే ఐఎస్ఓ ట్యాంక్‌లను దిగుమతి చేసుకుంది. అంతర్జాతీయంగా ఎంతోమంది ప్రాణాలను కాపాడటంలో ఆక్సిజన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందిప్పుడు. దాదాపు 75%కు పైగా పూరించబడిన ఐఎస్ఓ ట్యాంక్‌లను భారత నౌకాదళానికి చెందిన నౌక తీసుకువచ్చింది. ఖాళీ అయిన ట్యాంక్‌లను ఇక్కడ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానమార్గంలో ఆక్సిజన్ సరఫరాదారుల వద్దకు చేరుస్తుంది. సింగపూర్, కువైట్, అబుదాబీ మరియు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా నుంచి ఎల్ఎంఓను అంతర్జాతీయ సరఫరాదారులు M/sలిండే , M/sఎయిర్లైఫ్, M/sఎయిర్ లిక్విడ్‌కు సరఫరా చేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ ఇప్పటికే ఎల్ఎంఓకు సంబంధించిన పలు కన్సైన్మెంట్స్ను మంగళూరు, బెంగళూరు సహా పలు దక్షిణాదిరాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.
ఎల్ఎంఓ, ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లుకు సంబంధించిన పలు దిగుమతులను ఐసీఆర్ఎస్ (ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ) చేశాయి. వీటిని సైతం ఇండియన్ ఆయిల్ నిర్వహించడంతో పాటుగా వాటి దిగుమతి, రవాణా కార్యక్రమాలను సైతం నిర్వహించింది.
బాధ్యతాయుతమైన కార్పోరేట్ సిటిజన్‌గా, ఇండియన్ ఆయిల్ తమ నైపుణ్యం, వనరులపై ఆధారపడి దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం నుంచి దేశం బయటపడేందుకు తోడ్పాటునందిస్తుంది.
భారతదేశంలో ఎల్ఎంఓ నిర్వహణ మరియు రవాణాకు సంబంధించిన ఇతర కార్యక్రమాలలో సంజీవని ఎక్స్‌ప్రెస్ సహా పలు కార్యక్రమాలున్నాయి. వైద్య పరమైన అవసరాల కోసం వినియోగించే ఆక్సిజన్ కేటాయింపులు, డిశ్పాచ్, రిసిప్ట్నుపర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా వాటాదారులందరికీ సహాయపడుతూనే వాస్తవ సమయంలో సైతం పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సింగల్ విండో అప్లికేషన్ సంజీవని ఎక్స్‌ప్రెస్.
Post A Comment:
0 comments: