ఘనంగా రెడ్ క్రాస్ దినోత్సవం


జాన్ హేన్రి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న రెడ్ క్రాస్ ప్రతినిధులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక నడిగడ్డలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జాన్ హేన్రి డ్యూనంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ అధ్యక్షుడు దస్తగిరి, సెక్రెటరీ ఉస్మాన్, మండల చైర్మన్ నాగేశ్వరరెడ్డి, మాస్టర్ స్కూల్ కరస్పాండెంట్ హాలిమా, ఉపాద్యాయులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ


గతంలో కరోనా నేపథ్యంలో నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల గురించి ప్రశంసిస్తూ రాష్ట్ర చైర్మన్, గవర్నర్ బిశ్వ భూషణ్  హరిచందన్ దృష్టికి   తీసుకెళ్లిన జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ నాగరాజునాయుడులకు నంద్యాల కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెడ్ క్రాస్ తరుపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: