గాంధీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్

వైద్య పరిస్థితులపై పరిశీలన

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కరోనా చికిత్సలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ప్రగతిభవన్‌ నుంచి నేరుగా సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడ కరోనా చికిత్స ఏర్పాట్లు, సదుపాయాలపై ఆరా తీశారు. ఆక్సిజన్‌, ఔషధాల లభ్యత గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గాంధీ దవాఖానలోని కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో  చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్లను సీఎం పరామర్శించారు. గాంధీలో సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్ లను, వైద్య సిబ్బందిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్లను పరామర్శిస్తూ, వారిలో ధైర్యం పెంపొందించేందుకు యత్నించారు. ఔట్ పేషెంట్ వార్డులో కరోనా చికిత్స పొందుతున్న పేషంట్లకు అందుతున్న వైద్యసేవల  సీఎం కెసిఆర్ అడిగి తెలుసుకొన్నారు.


 

 

 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: