సచివాలయాలలో,,,
సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ
తనిఖీ చేస్తున్న సబ్ కలెక్టర్ కల్పనా కుమారి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణంలోని వార్డు సచివాలయాలను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురం, ఎమ్మెస్ నగర్ లోని సచివాలయాల ను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, తహసిల్దార్ రవికుమార్, ఇంచార్జ్ డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ అంకిరెడ్డిలతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఫీవర్ సర్వే జరుగుతున్నదని అందులో భాగంగా పట్టణంలోని వార్డులలో సర్వేను పరిశీలించుట కొరకు పట్టణంలోని జ్ఞానాపురం, ఎమ్మెస్ నగర్ లోని సచివాలయాలను తనిఖీ చేసి ఆ వార్డులో జరుగుతున్న ఫీవర్ సర్వేపై ఆరా తీశామని, ఫీవర్ సర్వే ద్వారా ప్రజలకు కరోన లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేదా అని తెలుసుకోవచ్చని, అంతేకాకుండా సచివాలయం సిబ్బంది, వాలెంటీర్లు, వార్డులోని
ప్రజలకు కోవిడ్ నియంత్రణపై అవగాహన కలిగేలా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం సబ్బునీటితో తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం అత్యవసరలలో శానిటేషన్ ద్వారా చేతులు శుభ్రపరుచుకునే విషయాలపై ప్రజలకు బాగా అవగాహన కలిగించాలని సిబ్బందికి సూచించామన్నారు. సెకండ్ వేవ్ కరోన తీక్షణంగా ఉన్నదని అందుకొరకే ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించిందని ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్ననందుకు చాలా సంతోషమన్నారు. ప్రజలు పూర్తిగా సహకరించినప్పుడే కరోనాను కట్టడి చేయగలమన్నారు. వీరి వెంట సచివాలయాల సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: