ముస్లిం నగరా ఆధ్వర్యంలో...

హిందూ మహిళా శవానికి అంత:క్రియలు

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

కోవిడ్ హిందూ మహిళ మృతదేహానికి ముస్లిం సోదరుల హిందూ సంప్రదాయంప్రకారం అంత్యక్రియలు నిర్వహించి వసుధైక కుటుంబం వాతావరణం నెలకొల్పారు హిందూపురంలోని ముస్లిం నగరా నేతలు నెలకొల్పారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ హిందూపురం పట్టణంలోని టీచర్స్ కాలనీలో సువర్ణా బాయి లేట్ కృష్ణమూర్తి రావు గారి భార్య కోవిడ్ తో మరణించింది మూడు రోజుల క్రితం కొడుకు శ్రీనివాసరావు కోవిడ్ మహమ్మారి తో మరణించాడు కుటుంబంలో బంధువులు ఎవరూ లేక పోవడంతో మిత్రులు డీసీ జబీ.రఫీఖ్.ఆర్థిక సహకారంచేస్తూ ముస్లిం నగారా &టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు సంప్రదించగా రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ మన్సూరుద్దీన్ కు విషయం ఫోన్ ద్వారా తెలిపి కోవిడ్ నియమ నిబంధనలతో పీపీఈ కిట్లు మాస్కులు గ్లౌజులు శానిటయిజర్ ఉపయోగించి

 


ఇంటివద్ద నుంచి అంబులెన్స్ లో తరలించి కోవిడ్ జనరల్ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయo ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ దాదాపు వంద దాకా అనాధ శవ అంత్యక్రియలు. దాదాపు వందకు పైగా కోవిడ్ శవాలను మిత్ర బృందం ఉదయ్ లైఫ్ వరల్డ్. టిప్పు బ్రిగేడ్ అతీఖుర్రహమాన్. టిప్పు సుల్తాన్ మానవతా రక్తదానసంఘ షేఖ్ షబ్బీర్.టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఇనాయతుల్లా.సుల్తాన్.బషీర్. వసీమ్. సైఫుల్లా తదితరులు అంత్యక్రియలకు సహకరించారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి తో చనిపోతే ఎవరూ లేరని బాధపడకండి మేమున్నాం 9346943336కు కాల్ చెయ్యండి కోవిడ్ మహమ్మారి సమయం లో ఆదుకోవడానికి మేమున్నాము కుల మత వర్గ వర్ణ జాతి ప్రాంతీయ బేధాలకు అతీతంగా మా మిత్రబృందం వసుధైక కుటుంబం.మత సామరస్యం.పరమత సహనం .సోదరభావం. జాతీయ సమైక్యత. దేశ సుస్థిరత.దేశ అభివృద్ధి ఎజెండాగా ఆచరణాత్మకంగా పనిచేస్తున్నామని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: