ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ప్రైవేట్ వైద్యశాలలో కోవిడ్ నివారణ చికిత్స కు ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. శుక్రవారం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇంచార్జి డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ అంకిరెడ్డితో కలిసి నంద్యాల పట్టణంలో కోవిడ్ చికిత్సలు నిర్వహిస్తున్న సాయివాణి హాస్పిటల్, కె.వి.ఆర్ హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, సాయి బాలాజీ హాస్పిటల్, ఉదయానంద హాస్పిటల్ లను ఆకస్మికంగా తనిఖీ గావించారు. అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కోవిడ్ నివారణ కొరకు వైద్యం అందించేందుకు కొన్ని ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వము అనుమతులు ఇవ్వడం జరిగిందని, ఆ ఆసుపత్రులందు కోవిడ్ నివారణకు సంబంధించి వైద్యము ఎలా అందిస్తున్నారని,
అక్కడి వసతులు ఎలా ఉన్నాయని తెలుసుకొనుటకు కొరకే జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, సాయి వాణి హాస్పిటల్ ను తనిఖీ చేశామని, హాస్పిటల్ పరిసర ప్రాంతంలో అపరిశుభ్రతంగా ఉన్నందున హాస్పిటల్ వారితో మాట్లాడి హాస్పిటల్ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ చేస్తూ ఉండాలని, హాస్పిటల్ కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ కు ప్రభుత్వం తరపున ఉన్న నోడల్ ఆఫీసర్ కూడా ఆదేశించామన్నారు. కెవిఆర్ హాస్పిటల్ లో తనిఖీ చేయడం జరిగిందని ఈ ఆసుపత్రి యందు కోవిడ్ వారికి ప్రత్యేకమైనటువంటి గేటు ఏర్పాటు చేయాలని హాస్పిటల్ ను శుభ్రంగా ఉంచుకోవాలని, హాస్పిటల్ వివరాలకు సంబంధించిన సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని హాస్పిటల్ యజమానులకు నోడల్ అధికారులకు ఆదేశించామన్నారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ నందు తనిఖీ చేయడం జరిగిందని హాస్పిటల్ నందు సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదని వెంటనే హాస్పిటల్ నందు ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, ఎన్ని బెడ్స్ నందు పేషెంట్స్ ఉన్నారని, ఇంకా ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయనే వివరాలు తెలిపే బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని, నోడల్ అధికారులకు సూచించామన్నారు. సాయి బాలాజీ హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేశామని, హాస్పిటల్ నందు కోవిడ్ నిబంధనలను సరిగ్గా పాటించలేదని నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హాస్పిటల్ యాజమాన్యాన్ని, నోడల్ అధికారులను హెచ్చరించామన్నారు.
అనంతరం ఉదయనంద ఆస్పత్రిని తనిఖీ చేయడం జరిగిందని, అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ సక్రమముగా విధులు నిర్వహించేలా చూడాలని ఆసుపత్రి నందు ఎన్ని పడకాలు ఉన్నాయి, అందులో ఎన్ని పడకల యందు రోగులు ఉన్నారు, ఇంకా ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపే బోర్డులను ఖచ్చితంగా ప్రదర్శించాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం అనుమతించిన ఈ కోవిడ్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తిస్తుందన్నారు. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడమేమనగా కోవిడ్ కట్టడి కొరకు నంద్యాల యందు కర్ఫ్యూ నిర్వహిస్తున్నామని ప్రజలందరూ కూడా సహకరించాలని కోవిడ్ నివారణ అరికట్టాలంటే స్వయం నియంత్రణ మార్గమని ప్రతి ఒక్కరూ ఎవరి వంతు వారు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, సబ్బు నీటితో చేతులను శుభ్రపరచుకోవడం అత్యవసర సమయాల్లో శానిటైజర్ లో వినియోగించుకోవడం ఇలాంటివన్నీ ఎవరికి వారు పాటించినట్లయితే కరోనాను కట్టడి చేయగలమన్నారు. నంద్యాల పట్టణంలో దాదాపుగా కోవిడ్ కు గురి అయిన వారు ఎనిమిది వందల మంది ఉన్నారని,
గత రెండు రోజుల నుండి కోవిడ్ కొద్దిగా తగ్గుముఖం పట్టిందన్నారు. నంద్యాల పట్టణ శివార్లలోని ఎస్ఆర్బిసి కాలనీలో టిడ్కో గృహాల యందు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని, కరోన పాజిటివ్ వచ్చిన వారు ఎవరు కంగారు పడవద్దని, అవసరమైతే ఇంకా కొన్ని టిడ్కో గృహాలను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం నంద్యాల పట్టణంలో జరుగుతున్న కర్ఫ్యూ ను పరిశీలించామని, నంద్యాల పట్టణంలో ఆర్ఎస్ రోడ్డు, శ్యామ కాల్వ ప్రాంతము నందు శ్రీనివాస సెంటర్, బొమ్మల సత్రం తదితర ప్రాంతాలన్నీ పరిశీలించామని, అన్ని ప్రాంతాలలో షాపుల యజమానులు స్వచ్ఛందంగా షాపులను మూసి ఉంచారని, ప్రజలు అందరూ కూడా సహకరించినట్లయితే త్వరలోనే కోవిడ్ కట్టడి చేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రుల యజమానులు డాక్టర్లు నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: