ఆ ఘటనపై విచారణ జరిపించాలి

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

నకిరేకల్ మునిసిపల్ మేయర్ ఎన్నికలలో ఎక్ష్ అపిషియో జాబితాలో ఎం.పి కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎమ్.ఎల్.సి బాలసాని లక్ష్మి నారాయణ పేర్లు ఎలా చోటు చేసుకున్నాయో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర పురపాలక శాఖ కమీషనర్, డైరెక్టర్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ కోరారు. ఈ మేరకు వారికి ఓ వినతి పత్రం పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత పిబ్రవరి లో జరిగిన జి.హె.చ్.ఎమ్.సి మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు, ఆ విషయాన్ని దాచిపెట్టి తిరిగి నకిరేకల్లో ఎక్ష్ అపిషియో జాబితాలో నమోదు చేసు కో వడము క్రిమినల్ చర్య. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు రాష్ట్రములో ఏదో ఒక చోట మాత్రమే ఎక్ష్ అపిషియో సభ్యుడిగా ఓటు వేయడానికి అర్హులు. ఆయా సభ్యుడు లిఖిత పూర్వకంగా కోరుకుంటే తప్ప సంబదిత స్తానిక సంస్థలో ఎక్ష్ అపిషియో సభ్యుల జాబితాలో చేర్చరు. నమోదు చేసుకోవడానికి వారు ఆప్షన్ లెటరు ఇచ్చారా? అధికారులు తేల్చాలి ? కాంగ్రెసు వార్డు సభ్యులు అభ్యంతరము తెలిపి ఆర్.టి.ఐ చటము ప్రకారము వివరాలు సేకరించి చూపెట్టకుంటే, అధికారులు వత్తిళ్లకులొంగి వారికి ఓటు వేసే అవకాశమిచ్చేవారు. దీనికంతటీకి మూల సూత్ర దారి మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన పై, ఎం.పి కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎమ్.ఎల్.సి బాలసాని లక్ష్మి నారాయణల పై సహకరించిన అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కోరడము జరిగింది.  ఈ సంఘటన ఈ ఎన్నికలను పర్యవేక్షించడములో అటు ఎన్నికల సంఘము మరియు ఇటు రాష్ట్ర పురపాలకశాఖలు ఘోరముగా విపలమయ్యాయని, పట్టు కొల్పోయాయని చెప్పడానికి నిదర్శనము. జనవరి 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభ్యంతరం తెలిపినా, విభజన సమయములో ఆంధ్ర ప్రాంతానికి కేటాయించబడిన రాజ్య సభ సభ్యుడు కె. కేశవరావుకు తుక్కుగుడా మునిసిపాలిటీ లో ఎక్ష్ అపిషియో సభ్యుడిగా చట్ట విరుద్ధంగా ఓటు వేయ నిఛ్చారు. రాష్ట్ర విభజన సమయములో కె.వి.పి ని తెలంగాణా కు కె.కె ను ఆంధ్ర కు కేటాయించడము జర్గింది. అయినా రాష్ట్ర ఎన్నికల సంఘము నిర్వాకము వలన ఆ ఇద్దరూ ఆ ఎన్నికలలో తెలంగాణా లోనే ఓటు వేయడము జరిగినది. అది చట్ట విరుద్దము. ఎన్నికల సంఘానిదే భాద్యత. ఎక్ష్ అపిషియో సభ్యుడిగా కె.వి.పి. నేరేడుచర్ల మునిసిపాలిటీలో ఓటేస్తే, కె.కె. తుక్కుగుడా మునిసిపాలిటీలలో ఓటు వేయడము జరిగినది. కె.కె. ఓటు విషయములో రాజ్య సభ సెక్రటేరియట్ నుండి వివరణ కొరామని, ఆ రిపోర్ట్ వచ్చిన తరవాత చర్య తీసుకుంటామన్న ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ బయట పెట్ట లేదు.చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా ఆ రిపోర్ట్ బయట పెట్టి తీసుకున్న చర్యల్ని ప్రజలకు తెలుపాలి. ప్రస్తుత నకిరేకల్ విషయములో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించి బాధ్యులైన , మంత్రి జగదీశ్ రెడ్డి, ఎం.పి కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎమ్.ఎల్.సి బాలసాని లక్ష్మి నారాయణ, సంభందిత అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలి. అని ఆయన కోరారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: