నంద్యాలలో పేద వధువుకు,,,

డబుల్ కాట్ మంచం విరాళం


డబుల్ కాట్ మంచాన్ని అందజేస్తున్న దృశ్యం 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ చెరువు కట్ట వద్ద పేద వధువు  వివాహ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా డబుల్ కాట్ మంచాన్ని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గన్ని ట్రస్ట్ చైర్మన్ గన్ని కరీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా గన్ని కరీం మాట్లాడుతూ పేదలకు వివాహ నిమిత్తం సహాయం చేయడం అభినందనీయమని, అబ్దుల్లా గతంలో కూడా ఎందరికో వివాహాల సందర్బంగా మంచాలను, బీరువాలను అందజేయడం జరిగిందన్నారు. 
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ పేదల ఇళ్లలో వివాహ  నిమిత్తం మంచం కానీ బీరువా కానీ  అవసరం అయితే పెళ్ళికి 3నెలల ముందు తనను సంప్రదిస్తే కుల, మతాలకు అతీతంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. వధువు తల్లి మాట్లాడుతూ అడిగిన వెంటనే తమకు డబుల్ కాట్ మంచం అందజేసిన అబ్దుల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి ఉస్మాన్ బాష మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే డబుల్ కాట్ మంచం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అబ్దుల్లాకు ధన్యవాదములు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: