ఈటెలపై ఆరోపణలు..
మొదలైన విచారణ
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లా అచ్చంపేటలో అ.ని.శా., విజిలెన్స్ అధికారులు ఈ ఉదయం విచారణ ప్రారంభించారు. మంత్రిపై ఫిర్యాదులు చేసిన రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈటల అసైన్డ్ భూముల కబ్జా చేశారని నిన్న సీఎం కేసీఆర్‌కు రైతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఫిర్యాదుపై కేసీఆర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్ పాల్గొన్నారు. అచ్చంపేటలో తుప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటలకు చెందిన హేచరీస్‌లో డిజిటల్ సర్వే కొనసాగుతోంది. దీంతో పాటు హేచరీస్‌కు పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లోనూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తున్నారు. తుప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ నేతృత్వంలో మంత్రి ఈటల ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు శామీర్‌పేట్‌లోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈటలకు అనుకూలంగా నినాదాలు చేశారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: