జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల,,
ఆరోగ్యం కోసం హెల్ప్ లైన్..
కోవిడ్ నేపథ్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్లతో సమానంగా సేవలందిస్తున్న జర్నలిస్టులను తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రత్యేకంగా గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. 8639710241 నెంబర్‌కు వివరాలు వాట్సప్ చేస్తే అవసరమైన మందులు, పడకలు, ఇతర ఎమర్జీ సేవలు అందనున్నాయి. ప్రత్యేకంగా నియమించిన వైద్య నిపుణులు ఈ సేవలందించనున్నారు. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు హెల్ప్‌లైన్ కు వివరాలు పంపించారని, వారికి సహాయం చేసే కార్యక్రమం మొదలైందని ప్రజారోగ్య శాఖ సంచాలకులు Dr జి శ్రీనివాస రావు తెలిపారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోగలరని సూచించారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: