జర్నలిస్టులకు,,,
ఎన్-95 మాస్కులు,సానిటైజర్ ల పంపిణీ
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
బృందావనం,భారతి గార్డెన్స్,భారతి డిజిటల్స్ అధినేత గాదె కృష్ణ సౌజన్యంతో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎన్-95 మాస్కులతో పాటు10 లీటర్ల సానిటైజర్ డబ్బాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ రాజేశ్వర చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ కమిటీకి అందజేశారు.శనివారం జిలా అదనపు కలెక్టర్ చాంబర్ లో జర్నలిస్టులకు వారు పంపిణీ చేసారు.
కరోనా విపత్కర సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు భారతి సంస్థల ఎండి గాదె కృష్ణ ఈ సేవా కార్యక్రమం చేపట్టడం ఆభినందనీయమని ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్నారు.కరోనా కష్ట కాలంలో నేనున్నాంటూ గాదె క్రిష్ణ జర్నలిస్టులకు అండగా ఉండడం అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.కరోనా బారిన పడి జిల్లాలో ఇప్పటి వరకు ఆరుగురు జర్నలిస్టులు మరనించగా వందలాది మంది జర్నలిస్టులు కరోనా పాజిటివ్ కు గురయ్యారని వారి ఆరోగ్యాల రక్షణకు గాదె క్రిష్ణ ముందుకు రావడం చాల గొప్ప విషయమని ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కోశాధికారి రామకృష్ణ,రాజులు అన్నారు.ఈ కార్యక్రమంలో భారతీ సంస్థల ప్రతినిధులు జగన్,అంగిరేకుల సాయిలు,ధనుంజయ్,ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: