ఉదారతను చాటుకొంటున్న కార్మిక సంఘాలు
ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు
త్వరలో అందుబాటులోకి రానున్న 40 పడకల ఐసోలేషన్ కేంద్రం
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
తమ చమటోర్చి దేశ పురోగతిలో భాగస్వామ్యమయ్యే శ్రామిక వర్గం కరోనా విపత్కర వేళ సేవాలను తమ ఉదారతను చాటుకొంటున్నాయి. అలాంటి ఉదారత కార్యక్రమానికి సీపీఐ ఏపీ ప్రతినిధి వర్గం, విజయవాడ నగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్, విజయ వాడ టైర్స్ అసోసి యేషన్ త్వరలో ఓ రూపం ఇవ్వనున్నాయి. ఈ సంఘాల ఆధ్వర్యంలో 40 బెడ్స్ ఐసోలేషన్ సెంటర్ కోవిడ్ పాజిటీవ్ రోగులకు సేవలందించేందుకు సర్వం సిద్దమవుతోంది.
విజయవాడలోని కానూరు న్యూ ఆటోనగర్ - సీ బ్లాక్ లో ఏర్పాటైన ఈ సెంటర్ సేవలు సోమవారం నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. సీపీఐ ఏపీ ప్రతినిధి వర్గం, ఆటో నగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్, విజయ వాడ టైర్స్ అసోసి యేషన్ లు ఈ సెంటర్ను సంయుక్తంగా నిర్వహించ నున్నాయి. ఈ సెంటర్ ఏర్పాట్లు, నిర్వహణ తీరు, తెన్ను లను.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తో పాటు ఏటీఏ, వీటీఏ ప్రతినిధి బృదం బుధవారం ఉద యం సందర్శించి పరి శీలన జరిపింది.. ఎటువంటి తారతమ్యం, హెచ్చుతగ్గులు లేకుండా సెంటర్ సేవలు అందరికీ అందుబాటులో ఉంటా యని ఈ సదర్భంగా నిర్వాహకులు పేర్కొ న్నారు.
Post A Comment:
0 comments: