ధనికులు రంజాన్ మాసంలో పేదలను ఆదుకోండి

కౌన్సిలర్ తబ్రేజ్ సేవలు ప్రశంసనీయం

320 మందికి ఈద్ కిట్లు పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

రాష్ట్రంలోని మైనార్టీలకందరికి పవిత్రమాసం రంజాన్.రంజాన్ పండుగకు ధనికులు పేదవారిని ఆదుకోవాలని వన్ టౌన్ సిఐ ఓబులేసు అన్నారు.4 వ వార్డు కౌన్సిలర్ తబ్రేజ్ ఆర్థిక సహాయంతో రంజాన్ సందర్భంగా జాకాత్ డబ్బులతో పేదలు ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి సిఐ ముఖ్యఅతిథిగా హాజరయ్యి 320 మందికి 9 రకాల నిత్యావసర వస్తువులు పంపినిచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను పేదవారు సైతం పండుగ ఆనందంగా చేసుకోవటానికి కౌన్సిలర్ తబ్రేజ్ చేస్తున్న సేవలు అందరికి ఆదర్శం కావాలని అన్నారు.సమాజంలో ఎందరో ధనికులు ఉన్నారని,పండుగ సమయాల్లో పేదవారికి సహాయం చేస్తే ఆ కుటుంబ దేవినిలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయన్నారు. సేవచేసే గుణం అందరిలో ఉండాలని అన్నారు.పేదవారికి సహాయం చేస్తే వారి దీవెనలు మన కుటుంబాలు చల్లగా ఉంటాయని అన్నారు.


కౌన్సిలర్ తబ్రేజ్ మాట్లాడుతూ పేదవారికి కష్టాలు రుచిచూశానని అన్నారు.చిన్నతననం నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని అన్నారు.అల్లా దయవల్ల వ్యాపారాల్లో కొద్దిగా సంపాదించానని,ఉన్నదాంట్లో కొద్దిగా పేదలకు సహాయం చేయాలనే తలంపుతో రంజాన్ మాసంలో కొన్ని కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలని చిన్న సహాయం చేస్తున్నానని అన్నారు.రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని 320 మందికి 9 రకాల వస్తువులు పంపిణీ చేశానని తెలిపారు.ప్రజాసేవలో న వెంట ఉన్న స్నేహితుల సహాయ సహకారాలు మరచిపోలేనని అన్నారు.ప్రజాసేవ,స్నేహం విలువ మరచిపోకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు డీఎస్. హాబీబుల్లా,రాయలసీమ చాంద్, నయీమ్ బాష,ఖాదర్,ఖాసీం వలి, రసూల్,కబీర్,సలామ్,అన్సర్ బాష,బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.

 

 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: