ఆ కుటుంబాలకు రూ 10 లక్షల ఎక్సిగ్రేషియో చెల్లించాలి
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ అందక మరణించిన కోవిడ్ బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని తిరుపతి తో సహా విజయవాడ, కదిరి, అనంతపురం, కర్నూలు, హిందూపురం, అమలాపురం ఇలా అనేక చోట కోవిడ్ బాధితులు ఆక్సిజన్ అందక మరణించారని ఆయన తెలిపారు. ఇలా మరణించిన వారి వల్ల ఒక ఉపాధి కోల్పోయి బాధిత కుటుంబాలు ఆసరా కోల్పోయినట్లే ఆయన పేర్కొన్నారు. కావున ఈ కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రుయా ఆసుపత్రి బాధితులకు ఎలాగైతే ఎక్సిగ్రేషియా ప్రకటించారో అదే తరహాలో ఇతర ప్రాంతాల్లో ఆక్సిజన్ అందక మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు
Post A Comment:
0 comments: