మంచి అవకాశం...సద్వినియోగం చేసుకోండి

కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యా ప్రమాణాలు

ఒక్కసారి విద్యార్థి చేరితో అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే ఇస్తుంది

నాణ్యమైన విద్యా గ్యారెంటీ

సికింద్రాబాద్ బాలుర 1పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.రమేష్


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ మైనారిటీ గురుకులంకు చెందిన సికింద్రాబాద్ బాలుర 1పాఠశాలలో 2021 - 22 విద్యా సంవత్సరంలో 5 ,6 ,7 ,8 తరగతులకు ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ .రమేష్ తెలిపారు. దరఖస్తులకు ఈ నెల 20వ తేదీ గడువుగా ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయనొక ప్రకట విడుదల చేశారు. ప్రస్తుతం 5వ తరగతి లో 80 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిలో 60 సీట్లు మైనార్టీలకు, 20 ఎస్సీ ,ఎస్టీ ,బిసి ఓసి లకు కేటాయించామని ఆయన వెల్లడించారు.

గత సంవత్సరపు 6 ,7 8 తరగతులలో భర్తీకాకుండా మిగిలిపోయిన ముస్లిం విద్యార్థుల సీట్లను వారి చేతనే భర్తీ  చేయనున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యుతో పాటు హాస్టల్ సౌకర్యం ఉచితంగా కల్పిస్తున్నాతెలిపారు. కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ఈ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని వెల్లడించారు.  సికింద్రాబాద్ బాలుర -1 గురుకుల పాఠశాల 2017 లో ప్రారంభించిన నాటి నుండి ఇప్పటివరకు విద్య ప్రమాణాలు కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పాఠశాల నందు అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. కంప్యూటర్ ,సైన్స్ ల్యాబ్ , కరాటే నేర్చుకొనే సదుపాయలం,  ప్రొజెక్టర్ సదుపాయంతో విద్యాబోధన, పిల్లలకు వ్యాయామం కోసం ఆటలు ఆడించడం, వారిలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రోబోటిక్స్ ల్యాబ్ సదుపాయం, అదేవిధంగా ఉచితంగా పిల్లలకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు , బెల్టులు ఐడి కార్డ్స్ , డైలీ యూనిఫామ్స్ ,స్పోర్ట్స్ యూనిఫామ్, కాస్మోటిక్ కిడ్స్ స్టూడెంట్ స్టేషనరీ, ఆర్ట్ , క్రాఫ్ట్ సంబంధించిన వస్తువుల తో విద్యా బోధన , వినోద , విహార యాత్రలు నిర్వహించడం ప్రతి సంవత్సరం విధిగా పాటిస్తున్నామని తెలిపారు.

 


పిల్లల్లో సృజనాత్మకతను బయటికి తీయడానికి క్విజ్ పోటీలు  నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు చక్కటి నాణ్య మైనటువంటి భోజనం దానిలో వారంలో నాలుగు సార్లు గుడ్డు, నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మంచి పోషక విలువలు కలిగిన కూరలు, బూస్ట్, స్నాక్స్ అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రతి నెలలో విద్యార్థుల యొక్క వివరాలను వారి తల్లిదండ్రులకు తెలియజేయడం కోసం ముఖాముఖి సంభాషణ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్లాసులో స్లో లెర్నర్ గుర్తించి వారికి ప్రత్యేకమైనటువంటి విద్యాబోధన కూడా అందించడం జరుగుతుంది. సమ్మర్ సీజన్లో పిల్లలకు హార్స్ రైడింగ్ ,స్విమ్మింగ్ తదితర రంగాల్లో నైపుణ్యాన్ని నేర్పించడం జరుగుతుంది అని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేస్తూ విద్యార్థి భవిష్యత్తు కి బాటలు వేస్తూ విద్యార్థుల ప్రగతి కి ముందుకు నడిపించడం జరుగుతుంది అని ఆయన అన్నారు. కావున పేద మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సికింద్రాబాద్ బాలుర 1పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.రమేష్ కోరారు.


 

 


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: