మే 2021

 'ఊర్వశి ఓటిటి'కి గర్వకారణం

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అంకితం!!


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన కానుకగా.. మహేష్ బాబు తమ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఈ సంవత్సరం కరోనా కలకలం దృష్ట్యా...  'సర్కారు వారి పాట' నించి కూడా ఏవిధమైన అప్డేట్ రావడం లేదు. అందుకే సూపర్ స్టార్ ఫాన్స్ ని ఉత్తేజపరిచేలా.. అల్లూరి సీతారామరాజుగా కనిపించి మైమరపించిన డేరింగ్ & డాషింగ్ హీరో కృష్ణ గారికి జన్మదిన కానుకగా ఆర్.పి పట్నాయక్ పాడిన విప్లవ వీరుని గీతం.. సూపర్ స్టార్ అభిమానులకు అంకితమిస్తూ ఊర్వశి ఓటిటి వారు విడుదల చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీరు.కె ఈ పాట రూపకల్పనకు సారధ్యం వహించగా ఆర్.పితో యువ గాయనీమణి మౌనిక గొంతు కలిపారు.

     ఊర్వశి ఓటిటి ఎమ్.డి రవి కనగాల- సిఇఓ రామసత్యనారాయణ మాట్లాడుతూ... "తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన సూపర్ స్టార్ కృష్ణగారిపై ఓ పాటను ఆయనకు కానుకగా, ఆయన అభిమానులకు అంకితం చేస్తూ విడుదల చేస్తుండడం మాకు ఎంతో గర్వంగా ఉంది. మాకు ఈ అవకాశం కలగజేసిన 'మా' అధ్యక్షులు నరేష్ గారికి మా కృతజ్ఞతలు" అన్నారు!!


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 కొత్త ఫ్యూచర్లతో

రెడ్‌మీ కొత్త ల్యాప్‌టాప్‌లు 

లేటెస్ట్ ప్రాసెసర్‌తో లాంచ్..!



స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన శైలీలో దూసుకెళ్లిన రెడ్ మీ సంస్థ కొత్త ఫ్యూచర్లతో, లేటెస్ట్ ప్రాసెసర్లతో తన కొత్త ల్యాప్ ట్యాప్ లను లాంచ్ చేసింది. రెడ్‌మీ బుక్ ప్రో 14, రెడ్ మీ బుక్ ప్రో 15 ల్యాప్‌టాప్‌లు కొత్త ప్రాసెసర్లతో మళ్లీ లాంచ్ అయ్యాయి. ఇవే ల్యాప్‌టాప్‌లు మూడు నెలల క్రితం ఇంటెల్ ప్రాసెసర్లతో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు తీసుకొచ్చిన ల్యాప్‌టాప్‌ల్లో ఏఎండీ రైజెన్ 5, రైజెన్ 7 ప్రాసెసర్లను అందించారు. వీటిలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. డీటీఎస్ ఆడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను కూడా ఇందులో అందించారు. పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. విండోస్ 10 హోం ఎడిషన్‌పై ఈ ల్యాప్‌టాప్‌లు అందించారు.

రెడ్‌మీబుక్ ప్రో 14 రైజెన్ ఎడిషన్ ధర

ఇందులో రైజెన్ 5 వేరియంట్ ధర 4,499 యువాన్లుగా(సుమారు రూ.51,200) ఉంది. రైజెన్ 7 వేరియంట్ ధరను 4,999 యువాన్లుగా(సుమారు రూ.56,900) నిర్ణయించారు. గ్రే కలర్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.


 

రెడ్‌మీ బుక్ ప్రో 15 రైజెన్ ఎడిషన్ ధర

రెడ్‌మీ బుక్ ప్రో 15లో రైజెన్ 5 వేరియంట్ ధర 4,999 యువాన్లుగా(సుమారు రూ.56,900) నిర్ణయించారు. రైజెన్ 7 వేరియంట్ ధర 5,499 యువాన్లుగా(సుమారు రూ.62,900) నిర్ణయించారు. ఇది కూడా గ్రే కలర్‌లోనే అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ 12లో అదిరే ఫీచర్లు.. పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే!

రెడ్‌మీ బుక్ ప్రో 14 రైజెన్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు

ఇందులో 14 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. పిక్సెల్ రిజల్యూషన్ 2,560x1,600గా ఉండగా, యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. రైజెన్ 5 5500యూ లేదా రైజెన్ 7 5700యూ ప్రాసెసర్‌లను ఇందులో అందించారు. 16 జీబీ డీడీఆర్4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, రెండు యూఎస్‌బీ టైప్‌-ఏ పోర్టులు, ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. వైఫై 6, బ్లూటూత్ వీ5.1 ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఇందులో రెండు 2W స్పీకర్లు ఉన్నాయి. వీటిలో డీటీఎస్ ఆడియో ఫీచర్ కూడా ఉండనుంది. ఇందులో 56Whr బ్యాటరీ ఉండనుంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.72 సెంటీమీటర్లుగానూ, బరువు 1.4 కేజీలుగానూ ఉంది.

రెడ్‌మీ బుక్ ప్రో 15 రైజెన్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు

ఇందులో 15.6 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. పిక్సెల్ రిజల్యూషన్ 3,200x2,000గా ఉండగా, యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. రైజెన్ 5 5600హెచ్ లేదా రైజెన్ 7 5800హెచ్ ప్రాసెసర్‌లను ఇందులో అందించారు. 16 జీబీ డీడీఆర్4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. దీంతోపాటు రేడియోన్ ఏఎండీ గ్రాఫిక్స్ అందించారు.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. యూఎస్‌బీ టైప్-సీ, యూఎస్‌బీ టైప్‌-ఏ, హెచ్‌డీఎంఐ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. ఇక వైఫై 6, బ్లూటూత్ వీ5.1 ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో రెండు 2W స్పీకర్లు ఉన్నాయి. వీటిలో కూడా డీటీఎస్ ఆడియో ఫీచర్ ఉండనుంది. ఇందులో 70Whr బ్యాటరీ ఉండనుంది. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.79 సెంటీమీటర్లుగానూ, బరువు 1.8 కేజీలుగానూ ఉంది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

 కోవిడ్ సేవలు నిలిపి ఇతర సేవలకు అవకాశమా

వారు యధేచ్చగా దోపిడి చేసుకోవచ్చా

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుప్రతులలో కేవలం ఐదింటిపై చర్యలు తీసుకొని మిగితా వారిని వదిలేయడంలో అంతర్యం ఏమిటీ అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 88 ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు రాగా వాటిలో 5 ప్రవేట్ ఆసుపత్రుల పై కేవలం కోవిద్ చికిత్సలు చేయకుండా ఆంక్షలు విధించిందన్నారు. అంటే మిగతా సేవలు ఆ ఆసుపత్రలు కొనసాగవచ్చు, భారీగా చార్జీలు వేయవచ్చా అని ఆయన నిలదీశారు. ప్రవేట్ ఆసుపత్రులు కేవలం కోవిడే కాకుండా అన్ని వైద్య సేవలకు మొదటి నుండి భారీగా చార్జీలు వసూలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అన్ని వైద్య సేవలపై కూడా విచ్చల విడిగా చార్జీలు వేయకుండా కట్టుదిట్టము చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా కఠినంగా వ్యవహరించాలానే చిత్తశుద్ది ఉంటే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ముందుకు కదలాలన్నారు. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా భవిష్యత్ లో ఏ మొచ్చినా సంసిద్దముగా ఉండమని హెచ్చరిస్తుందని ఆయన గుర్తుచేశారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 మీ సేవా కేంద్రాల వద్ద కిక్కురిస్తున్న జనం

ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ తప్పనిసరికావడంతో

కోవిడ్ నిబంధనలు కనిపించని వైనం

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

ఆధార్ నెంబర్ కు  ఫోన్ నెంబర్ లింక్ ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మీ సేవా కేంద్రాలు కిటకిటలాడాయి. ఉదయం ఐదు గంటల నుండి  మీ సేవ కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు ప్రజలు. 45 సంవత్సరాలు దాటిన వారికి ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ను లింక్  చేయడం తప్పని సరిచేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. మండల కేంద్రమైన గడివేముల లో ఒకటే మీ సేవ కేంద్రం ఉండడంతో ప్రజలు చుట్టుపక్కల  18 గ్రామాల ప్రజలు గుమ్మిగూడుతున్నారు. దీంతో జనసమూహం పెరగడంతో గడివేములలో రోడ్డున పోయే వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది.
ఈ మీ సేవా కేంద్రాల వద్ద జనం భారీగా రావడంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోంది. ప్రజల్లో ఆ తరహా భయం కూడా కనిపిపించని పరిస్థితి. అక్కడికి వచ్చిన ప్రజల్లో మెజార్టీగా మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటిస్తూ క్యూ నిబంధనలు పాటించకపోవడం వంటి ఘటనలు నెలకొంటున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం గానీ పోలీసు యంత్రాంగం గాపీ పెద్దగా శ్రద్ద పెట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 అసంఘటిత కార్మికులకు వరం

అటల్ పెన్షన్ యోజన పథకం

రూ.7 పొదుపుతో ప్రతి నెలా చేతికి రూ.5 వేలు!


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ ప్రతినిధి)

వయస్సు ఉన్నంతవరకే ఏదైనా..? అందుకే వయస్సు పై బడితే తమ జీవనం సాగేదెలా అన్నది అందరిలోనూ ఉండే బెంగ. ప్రభుత్వ ఉద్యోగి అయితే అతడికి పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఒకవేళ కొత్త వారికి అది లేకపోయినా ఓ సారి పెద్ద మొత్తంలో డబ్బలు అందుతాయి. కాబటి ఎలాంటి దిగులు ఉండదు. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు, అసంఘటిత రంగంలో పనిచేస్తే వారి పరిస్థితి ఏమిటీ..అందుకే వారి కోసం కేంద్రం ఓ కొత్త పథకం తీసుకొచ్చింది. ఇందుకోసం మీకు ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో చేరితే ప్రతి నెలా రూ.5 వేల వరకు పొందొచ్చు. దీని కోసం మీరు నెలకు రూ.210 కట్టాలి.


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరితే ప్రతి నెలా డబ్బులు లభిస్తాయి. అసంఘటిత రంగంలోని వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. పీఎఫ్ఆర్‌డీఏ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. ఆధార్‌ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా ఇతర ప్రాంతీయ బ్యాంకులు కూడా అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను తెరుస్తాయి. ఈ పథకంలో చేరిన వారు నెలకు రూ.1000 నుంచి రూ.5 వేలు పొందొచ్చు. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.210 చెల్లిస్తే రూ.5 వేలు వస్తాయి. అంటే మీరు రోజుకు రూ.7 ఆదా చేసినా సరిపోతుందని చెప్పుకోవచ్చు. అదే రూ.1000 కావాలంటే నెలకు రూ.42 కడితే సరిపోతుంది. రూ.2000 వేల పెన్షన్ కోసం రూ.84 చెల్లించాల్సి ఉంటుంది. రూ.3 వేల కోసం రూ.126 కట్టాలి. రూ.4 వేల పెన్షన్ కోసం రూ.168 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా డబ్బులు వస్తాయి. మీరు ఎం మొత్తం పెన్షన్ తీసుకోవాలనే అంశం మీరు చెల్లించే నెలవారీ మొత్తం ప్రాతిపదికన మారుతుంది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 తడవదు...చిరగదు

త్వరలో మరో కొత్త వంద నోటు

ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఆర్భీఐ

 


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ ప్రతినిది)

పెద్దనోట్ల రద్దుతో మనం పాత నోట్లను మర్చిపోయి కొత్త కొత్త నోట్లను చూడాల్సివస్తోంది. దీంతో ప్రస్తుతం దేశంలో రెండు వేలు, ఐదువందులు, వంద, యాభై ఇరవై, పది రూపాయల నోట్లను ఇప్పటికే చూశాం. అయితే రెండు వెల నోట్లు గత కొద్ది కాలంగా మార్కెట్ లో ఎక్కడా కనిపించడంలేదు. క్రమంగా దాని వినియోగం తగ్గుతోందని తెలుస్తోంది. ఇప్పటికే వందనోటును తీసుకొచ్చిన రిజర్వుబ్యాంక్ ఆప్ ఇండియా మరోసారి వంద కొత్త నోటు తీసుకురానున్నది. ఇప్పటికే తెచ్చిన రూ.100 నోట్లు. చూడటానికి ప్రస్తుతం వంద నోట్లు ఎలా ఉన్నాయో కొత్తవి కూడా అలానే ఉంటాయి. అయితే కొత్త నోట్లు ఎక్కువ కాలం మన్నికలో ఉండటమే దాని ప్రత్యేకత.

రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా అతిత్వరలోనే కొత్త రూ.100 కరెన్సీ నోట్లను తీసుకురాబోతోంది. ఇవి చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నోట్లు సాధారణ నోట్ల మాదిరి ఉండవు. చూడటానికి ఒకేలా ఉన్నా కూడా ఇవి స్పెషల్ అని చెప్పాలి. ఆర్‌బీఐ తీసుకురాబోతున్న కొత్త రూ.100 నోట్లకు వార్నిష్ పూత పూస్తారు. దీని వల్ల ఇవి ఎక్కువ కాలం మన్నికకు వస్తాయి. నీటికి తడవవు. అంత ఈజీగా చినిగిపోవు. దీంతో ఈ కొత్త రూ.100 నోట్లు ఎక్కువ కాలం మన్నికకు వస్తాయి. ఆర్‌బీఐ ఈ నోట్లను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఆర్‌బీఐ త్వరలోనే ఈ కొత్త రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకురావొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్‌బీఐకి ఈ నోట్ల ముద్రనకు సంబంధించి అనుమతి ఇచ్చింది. ఇకపోతే కొత్తగా రాబోతున్న నోట్లు.. ప్రస్తుతం రూ.100 నోట్లు ఎలా ఉన్నాయో చూడటానికి అలానే ఉంటాయి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 కరోనా కట్టడి చేసేదెవ్వరూ...?

నిబంధనలు లెక్క చేయకుండా జనంలో రోడ్డుపైకి

కట్టడి చేయాల్సిన వారు కనిపించని వైనం

అదే నిర్లక్ష్యానికి కారణమా..?


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ చేపట్టినా అసలు ఉద్దేశం పక్కదారిపడుతోంది. లాక్ డౌన్ ఎందుకు పెట్టారు, దాని ఉద్దేశం ఏమిటీ అన్నది ప్రజల్లో కనిపించడంలేదు. ఇలాంటి ఘటనలు కర్నూలు జిల్లా గడివేముల లో మనకు నిత్యం దర్శనమిస్తున్నాయి. వ్యక్తినుంచి వ్యక్తికి కరోనా వ్యాపిస్తోందని, అందుకే లాక్ డౌన్ విధించారన్న వాస్తవం ప్రజల్లోకి పంపడంలో అందరూ విఫలమయ్యారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


 

లాక్ డౌన్ మినహాయింపు సమయం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఉన్నా గడువు సమయం దాటినా గడివేముల ప్రాంతంలో జనం రోడ్లను మాత్రం విడవటంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో లాక్ డౌన్ ఉద్దేశం ఎక్కడ కనిపిస్తోందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు గుంపులు, గుంపులుగా రోడ్డుపైకి రావడం, వాహనాలతో రావడంతో గవివేముల పరిధిలో కరోనా నిబంధనల ఉల్లంఘనలు యథేచ్చగా సాగుతున్నాయి. లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్నది పోలీసు యంత్రాంగం అని అందరికీ తెలియదు. పోలీసుల రాకలేకపోవడం కూడా జనాలు రోడ్డుపైకి విస్త్రుతంగా తిరుగుతున్నారు అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Uploading: 1115136 of 1256042 bytes uploaded.

 

 

Uploading: 371712 of 1480155 bytes uploaded.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

దారిలోకి రాకుంటే,,,

ఆ ఆసుపత్రులను స్వాధీనం చేసుకోండి

సీఎంకు కాంగ్రెస్ నేత జి.నిరజంన్ లేఖ



నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనము చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి మెయిల్ ద్వారా ఓ లేఖ పంపారు. ఆ లేఖలోని సారాంశం ఇలావుంది. రాష్త్రములో ప్రైవేట్ ఆసుపత్రుల వారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని 88 పిర్యాదులు వస్తే, 64 ఆసుపత్రులకు నోటిస్ లిచ్చామని, ఒక ఆసుపత్రి గుర్తింపు రద్దు చేశామని నిన్న ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రశ్రీనివాసరావు గారు తెలిపారు. ఎన్ని సార్లు ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి కోరినా, హెచ్చరికలు జారీ చేసినా వారికి చీమ కుట్టినట్టయినా లేదు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని వెళ్లుతున్న వారి వద్ద యధావిధిగా అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దిక్కు తోచని పరిస్థితి లోకి నెట్టేస్తున్నారు. ఆసుపత్రి, డాక్టర్ అంటే వైద్యము చెయడానికని కాకుండా డబ్బు గుంజటానికే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్తితిలో ప్రజలు విలవిల లాడుతుంటే వారు నిర్లక్ష్యంగా భాధ్యతా రహితముగా మానవత్వము లేకుండా ప్రవర్తిస్తున్నందున మీరు క్రింద పేర్కొన్న కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనము కల్గించాలని కోరుతున్నాము. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక సారి నోటీసు ఇచ్చినా, నడవడిక లో మార్పు లేకుంటే ప్రభుత్వం వాటిని స్వాధీనము చేసుకుని నడిపించాలి. అవసరమైతే చట్ట సవరణలు చేయాలి. ఇలా స్వాధీనము చేసుకున్న ఆసుపత్రుల నిర్వహణకు ముఖ్యమంత్రి అధ్వర్యములో నిష్టాతులైన రిటైర్డ్ ధికారులు మరియు వైధ్యాధికారులతో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అందులో ఉన్న డాక్టర్లను, సిబ్బందిని ఆలాగే కొనసాగిస్తూ ప్రభుత్వ నియంత్రణలో సేవలు కొనసాగించాలి. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి, రోగుల నుండి వసూలు చేసే బిల్లు వివరాలను ఆన్ లైన్ లో పెట్టే విధంగా కట్టడి చేసి, వైద్య ఆరోగ్య శాఖ లో ఒక సెల్ ఏర్పాటు చేసి నిరంతరము పర్యవేక్షిస్తు, ఈ దోపిడిని అరికట్టాలి మీ సత్వర చర్యలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతాయి. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 షబ్బీర్ అహమ్మద్ స్పూర్తిని కొనసాగించాలి

సంస్మరణ సభలో ప్రముఖల నివాళి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ రాష్ట్ర కన్వీనర్ షెబ్బీర్ అహ్మద్ సంస్మరణ సభ" స్థానిక కమ్యూనిస్టు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర సలాహ మండలి సభ్యులు అష్రఫ్ అలీ మాట్లాడుతూ..ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వ్యతిరేక ఉద్యమం ముందు ఉండి నడిపి ప్రజల్లో నల్ల చట్టాల పై అవగాహన కల్పించిన షబ్బీర్ ఈ రోజు మన మధ్య నుండి వెళ్లిపోవడం బాధాకరం. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఆయన గురువారం తెల్లవారుజామున మృతి చెందారు అన్న విషయం ఆయన అభిమానులు రాజ్యాంగ ప్రేమికులకు తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆయన ఎస్ఐఓ లో చురుకుగా పనిజేసీ ఎందరో ధర్మ యోధులను ఇస్లామీయ ఉద్యమానికి అందించారు. గతంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కి రాష్ట్ర భాద్యులగా పనిజేసీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఇచ్చిన స్పూర్తితో రాజ్యాంగ విలువల కాపాడాలి అని అన్నారు.

ఏంపీజే రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ నల్ల చట్టాల పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో షబ్బీర్ అహ్మద్ పాత్ర ఎనలేనిదని, ప్రజా ఉద్యమంలో ఒక అజాత శత్రువు, నిగర్వి, ప్రజా సమస్యలపై నిరంతరం పొరాడిన యోధుడు అని అన్నారు. మున్సిపల్  మాజీ వైస్ చైర్మన్ కమ్యూనిస్టు నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ షబ్బీర్ అహ్మద్ లాంటి మేధావి మళ్ళీ పుట్టరు ఆయన్ని కోల్పోవడం బాధాకరం అన్నారు. బీసీ రాష్ట్ర నాయకులు పీఎల్పీ యాదవ్ మాట్లాడుతూ అలయన్స్ అగైనెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్సార్సీ, సీఏఏ కన్వీనర్ గా పనిచేసి తెలుగు రాష్ర్టాల ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన కలిపించిన గొప్ప వ్యక్తి షబ్బీర్ అహ్మద్ అని ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు సోమయ్య, ఎస్ఎండీ రఫీ, షేక్ ఖాసీం, మజ్లీసూల్ ఉలేమా అధ్యక్ష కార్యదర్సులు మౌలానా సాదిక్ మౌలానా అబ్దుర్ రహిమ్, ఎంపీజే రాష్ట్ర ఫౌండర్ మెంబర్ షేక్. రసూల్, పట్టణ కన్వీనర్ షేక్ గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 సైలెంట్ కిల్లర్...అధిక రక్తపోటు

"హైప‌ర్ టెన్ష‌న్ (ర‌క్త‌పోటు) అంటే" 


మన గుండె పని చెయ్యాలి కాని ప్రయాస పడుతూ పని చెయ్యకూడదు. రక్త పోటు అనేది గుండె ఎంత కష్టపడి పనిచేస్తున్నాదో సూచిస్తుంది. రక్తనాళాల్లో ఉరకలు, పరుగులు తీస్తూ ప్రవహిస్తూన్న రక్తం అలల మాదిరి ప్రవహిస్తుంది. ఇలా పారుతున్న రక్తం రక్తనాళల గోడల మీద ఒత్తిడి పెడుతోంది. ఈ ఒత్తిడి గుండెకి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండి, దూరం వెళుతూన్న కొద్దీ క్రమేపీ తగ్గి, కేశనాళికల దగ్గర నెమ్మదిగా౯ ప్రవహించి, ఆఖరున సిరలలో ప్రవేశించి నీరసించి, నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్ళా గుండె చేరుకుంటుంది. కనుక శరీరం అంతటా పోటు ఒకేలా ఉండదు. వైద్యులు 'రక్తపు పోటు' అన్నప్పుడు ధమనులలో ఉన్న పీడనాన్ని కొలుస్తారు. . శరీరం అంతా ఈ పీడనం ఒకేలా ఉండదు కనుక సాధారణంగా జబ్బ మీద కొలుస్తారు. ఈ పోటు వేళని బట్టి, అప్పటి వరకు పడ్డ ప్రయాసని బట్టి, మనస్సులో ఉండే ఆరాటాన్ని బట్టీ, వేసుకుంటూన్న మందులని బట్టీ కూడా మారుతూ ఉంటుంది. కొందరికి వైద్యుడి పరికరాలు చూడగానే గుండె దబదబ కొట్టుకుని ఈ పోటు పెరుగుతుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపు పోటు 120/80 ఉంటుంది. ఈ విలువలు 135/85 దాటితే ఆ వ్యక్తి అధిక రక్తపు పోటుతో బాధ పడుతూన్నట్లు అర్థం. సాధారణంగా ఈ కొలతలు రెండు మూడు సార్లు తీసి, సంఖ్యలు ఎక్కువగా ఉంటేనే రక్తపు పోటు ఎక్కువ ఉంద‌ని నిర్ణయిస్తారు. రక్త పోటు కొలవటానికి రెండు సంఖ్యలు వాడతారు. ఈ రెండింటిలో మొదటి సంఖ్య (ఎగువ ఉన్న సంఖ్య) సిస్టాలిక్‌పోటు, రెండవ సంఖ్య (దిగువ ఉన్న సంఖ్య) డయస్టాలిక్‌పోటు.


 
గుండె ముకుళించుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకి వస్తుంది. అప్పుడు ఈ పోటు ఎక్కువగా ఉంటుంది. అది సిస్టాలిక్‌పోటు. గుండె వికసించుకున్నప్పుడు ప్రవాహం అంతిమ దశలో ఉంటుంది. అప్పుడు ఈ పోటు తక్కువగా ఉంటుంది. అది డయాస్టాలిక్‌పోటు. పూర్వపు రోజుల్లో ఉష్ణోగ్రతనీ, రక్తపు పోటుని పాదరస స్తంభం పొడుగుని బట్టి కొలిచేవారు. ఈ రోజుల్లో పాదరస స్తంభం వాడకుండానే కొలవ గలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాల‌కి అధిక రక్తపోటు ప్రధాన కారణం. అధిక రక్తపోటును "నిశ్శబ్ద కిల్లర్" అని పిలుస్తారు, స్పష్టమైన లక్షణాలు లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ఉప్పు (సోడియం) తినడం, అధిక బరువు ఉండటం మరియు తగినంత వ్యాయామం చేయకపోవడం, అలాగే పొగాకు వాడటం వంటి వాటి వల్ల ర‌క్త‌పోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు,,,

సావిత్రీ బాయి పూలే క్రాంతి జ్యోతి అవార్డు


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్  యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ సేవలకు తెలంగాణ వరంగల్ మహిళా సాధికార ఫౌండేషన్ వారు సావిత్రీ బాయి పూలే క్రాంతి జ్యోతి ప్రశంసా పురస్కారాన్ని అందించారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ గత 20సంవత్సరాలు గా దాదాపు 54సార్లు రక్తదానం చేశారు వందలాది రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు టిప్పు సుల్తాన్ మానవతా రక్త దాన సంఘం లో వెయ్యి మంది రక్త దాతలు అనునిత్యం అత్యవసర సమయాల్లో శస్త్ర చికిత్సలకు కాన్పులకు రక్తదాన కార్యక్రమాలు చేస్తూ.

అనాధ శవ అంత్యక్రియలు కోవిడ్ రోగులు కరోనా తో మరణించి అంత్యక్రియలకు ముందుకు రాకపోతే ఉదయ్ లైఫ్ వరల్డ్ మిత్రబృందం టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ టిప్పు బ్రిగేడ్ సభ్యులు మిత్ర బృందం సహకారం తో వందకు పైగా కోవిడ్ బాధితుల అంత్యక్రియలలో కుల మతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహించారు మరియు సహకారాన్ని అందించారు గతంలో దాదాపు 15కు పైగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు తీవ్రవాద వ్యతిరేక .మత సామరస్య. సోదర భావ. జాతీయ సమైక్యత చైతన్య కార్యక్రమాలు దేశభక్తి కార్యక్రమాలు అనేక నిర్వహించారు ఈ విషయాలు పరిశీలించిన మహిళా సాధికార ఫౌండేషన్ చైర్మైన్ దామ రజనీ రుద్రమ ఉమర్ ఫారూఖ్ ఖాన్ సేవలను గుర్తించి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పోస్ట్ ద్వారా అవార్డును అందజేశారు. పుర ప్రముఖులు  ప్రశంసించారు.


 


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 ఆరుగురు జామియా విద్యార్థులు,,,

ప్రధాని రీసెర్చ్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు


జామియా మిలియా ఇస్లామియాకు చెందిన ఆరుగురు రీసెర్చ్ స్కాలర్స్ ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ (పిఎంఆర్ఎఫ్) కు ఎంపికయ్యారు. వారిలో ఐదుగురు బాలికలు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఫోజియా తబాసుమ్, మోమినా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అజ్రా మాలిక్, సెంటర్ ఫర్ నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ నుండి ఫిరోజ్ ఖాన్, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్‌ నుండి ఆలియా తయాబ్  ను సెంటర్ ఫర్ ఫిజియోథెరపీ మరియు రీహబ్లిటేషన్ సైన్స్ ( Physiotherapy and Rehabilitation Sciences) నుండి డిసెంబర్ 2020 డ్రైవ్ యొక్క లాటరల్ ఎంట్రీ స్కీం(lateral entry scheme) కింద పిఎంఆర్ఎఫ్ కోసం ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. కోఆర్డినేటర్ పిఎమ్‌ఆర్‌ఎఫ్-జెఎంఐ ప్రొఫెసర్ అబ్దుల్ క్వాయిమ్ అన్సారీ మాట్లాడుతూ ఆరుగురు పరిశోధకులు వ్యక్తిగతంగా మొదటి రెండేళ్లకు రూ .70,000, ఫెలోషిప్‌ను 3 వ సంవత్సరానికి రూ .75,000, నాలుగో, ఐదవ సంవత్సరానికి రూ .80,000 పొందుతారు. ఇది కాకుండా, ప్రతి ఫెలోకు రూ. పిఎంఆర్‌ఎఫ్ కింద సంవత్సరానికి 2 లక్షలు (ఐదేళ్లకు మొత్తం రూ .10 లక్షలు)పొందుతారు అని అన్నారు. జామియా వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్ ప్రకారం ఫెలోషిప్ పొందటం విద్యార్థులకు ముఖ్యంగా విశ్వవిద్యాలయ మహిళా  విద్యార్థులకు  సైన్స్ మరియు పరిశోధనలలో బాగా రాణించటానికి ప్రేరేపిస్తుందని భావించారు. "జెఎమ్ఐ(JMI) ఎక్సలెన్స్ కోసం నిలుస్తుంది మరియు ఉన్నత శిఖరాలను సాధించడానికి దాని విద్యార్థులకు సాధ్యమైనంత సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది" అని వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్ అన్నారు. చెప్పారు. వైస్ ఛాన్సలర్ పిఆర్ఆర్ఎఫ్-జెఎంఐ ప్రొఫెసర్ అబ్దుల్ క్వాయిమ్ అన్సారీ చేసిన గొప్ప కృషిని ప్రశంసించారు. అంతకుముందు, మే 2020 యొక్క లాటరల్ ఎంట్రీ స్కీమ్ కింద సెంటర్ ఫర్ నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ (సిఎన్ఎన్) నుండి ఎంఎస్ మరియా ఖాన్ మరియు ఎంఎస్ అబ్జీనా షబీర్, ఫెలోషిప్ కోసం జెఎంఐ నుండి  ఎంపిక చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

 మే 30వ తేదీ ఏపీ ప్రజల జీవితాల్లో,,,

వెలుగు నింపిన రోజు

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఈ నెల 30వ తేదికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ కు అభినందనలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి. ఈ రెండేళ్ల కాలంలో పదేళ్లకు సరిపడా అభివృద్ధి, సంక్షేమం చేపట్టారని కొనియాడారు. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు జగన్ చేసిన సాయం మరువలేనిదని అన్నారు.. అన్న మాట ప్రకారమే పాలన సాగిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేసుకున్నారని ఏలూరి అన్నారు.
పాలనను క్షేత్రస్థాయి వరకూ చేర్చి... అవినీతికి అడ్డుకట్టవేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం కూడా కలిగేలా చేశారని చెప్పారు. ప్రజలు కోరిన పాలన అందించడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందవచ్చనే కీలక సూత్రాన్ని జగన్ గుర్తించగలిగారని అన్నారు. తన తండ్రి ఆకస్మిక మరణానంతరం  కాంగ్రెస్ అధినాయకత్వం చేతిలో మోసపోయినా వెన్ను చూపకుండా తనదైన శైలిలో సుమారు పదేళ్ల పాటు శ్రమించి, ఆ తర్వాత తగిన ఫలం అందుకున్నారని అన్నారు. జగన్ జీవన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఏలూరి అన్నారు. ఎంచుకున్న దారిలో తీవ్రమైన ఆటుపోట్లు ఎదురవుతాయని తెలిసినా ఇచ్చిన మాటకోసం, తండ్రి ఆశయాలకోసం చేసిన పోరాటాన్ని ఏపీ ప్రజలు వృధా కానీయలేదని అన్నారు. మే 30వ తేదీ ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన రోజు.. ఆరోజు కోసం పదేళ్లుగా వేయికళ్లతో ఎదురుచూశామని ఏలూరి చెప్పారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే జగన్ లాంటి నాయకుడు కలకాలం వర్ధిల్లాలి అని ఏలూరి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

 షబ్బీర్ అహ్మద్ మరణం తీరనిలోటు

వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్ మరణించారు.  గురువారం ఉదయం రాజమండ్రిలో ఆయన కన్నుమూశారు. షబ్బీర్ అహ్మద్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు. షబ్బీర్ అహ్మద్ మరణం పార్టీకి తీరని లోటని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర ఫెడరల్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు , న్యాయవాది ఐ.ఎం. అహమ్మద్  పేర్కొన్నారు. విశాఖపట్టణంలోని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా క్యాంప్ ఆఫీస్ లో సంతాప కార్యక్రమం చేపట్టారు.

 

షబ్బీర్ అహ్మద్
 

షబ్బీర్ అహ్మద్ మరణంతో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా గొప్ప నాయకున్ని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏ లాంటి ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యలపై మైనార్టీ బడుగు, బలహీన వర్గాల సమస్యలపై పోరాడి ఆ వర్గాలకు ఆయన చేసిన సేవ మరువలేనిదని కొనియాడారు. షబ్బీర్ అహ్మద్ కు అల్లాహ్ స్వర్గప్రాప్తి కలిగించాలని ఆయన దువా చేశారు. షబ్బీర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు ఐ.ఎం. అహమ్మద్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కు షబ్బీర్ అహ్మద్ ఎంతో సేవ చేశారని కొనియాడారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

 ముస్లిం జనాభా పెరుగుదల...

అంతా దుష్ప్రచారం...?

ఈ తేడా గమనిస్తే చాలు ఎవరికి ఉద్దేశపూర్వక వ్యాఖ్యలో తెలుస్తుంది

ఏ ఆధారంలేకుండా నోటికొచ్చిన ఏ విమర్శ చేసినా సరే ముస్లిం సమాజంపై వేస్తే అది నిజమై పోతుంది. ఇది యావత్తు ప్రపంచంలో నెలకొన్న దుస్థితి. ముస్లింలను ఉద్దేశించి అప్రతిష్టపాలుజేసేందుకు నిరంతరం చేస్తున్న దుష్ప్రచారం ముస్లింలు కావాలనే సంతానం పెంచుతున్నారు అని. ఇది మన దేశంలోని బీజేపీ నేతల నోటి నుంచి వచ్చే సాధారణ మాట. కానీ వాస్తవం ఏమిటీ...? ముస్లింల జనాభా నిజంగా పెరుగుతోందా...? లేక తగ్గుతోందా... అంటే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముస్లింల జనాభా తగ్గుతోందని వివిధ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.

ముస్లిం “జనాభా పెరుగుదల  బాంబ్"  ప్రచారకుల వాదన విమర్శలకు గురి అయినది., భారతదేశంలో "ముస్లిం జనాభా పెరుగుతున్న ముప్పు" అనే ఒక తాజా నివేదికప్రకారం ముస్లిం కమ్యూనిటీ యొక్క సంతానోత్పత్తి రేటు ఇతర వర్గాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్నట్లు సర్వేలో తేలింది. "హిందూ మతం పేరు చెప్పి జాతీయవాదులుగా మెలుగుతున్నవారు తరచుగా ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. 2001 మరియు 2011 మధ్యకాలంలో భారతదేశంలో ముస్లింల శాతం 0.8 శాతం నుంచి 14.2 శాతానికి పెరిగింది. ఈ పరిస్థితిని కొనసాగించినట్లయితే 2025 నాటికి హిందువుల  సొంత దేశంలో వారి ఉనికి గురించి మనం మరచిపోవాలి, " అని గత సంవత్సరం ఒక ప్రధాన హిందూ జాతీయవాద సంస్థ నాయకుడు చెప్పారు. "కానీ వాస్తవంగా భారతదేశంలో ముస్లింలు, హిందువుల మధ్య సంతానోత్పత్తి అంతరం తగ్గుతుంది. సంతానోత్పత్తి అంతరం విబిన్న రాష్ట్రాల మద్య ఉంది, మతాల మద్య లేదు. బీహార్ లో  హిందూ మహిళలు ఆంధ్రప్రదేశ్ లో  ముస్లిం మహిళల కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారు"అని ది అట్లాంటిక్ పేర్కొంది, ది హిందూ 2015 ఒక ప్రత్యేకమైన అన్వేషణ నివేదిక ప్రకారం ఇది తేలింది. 

"ఇలాంటి ఆందోళనలు ఫ్రాన్స్, జర్మనీ, యు.కె., నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ దేశాలలో వలస వ్యతిరేక ప్రసంగాలు జరుగుతున్నవి. ఈ దేశాలలో ముస్లింలు మొత్తం జనాభాలో 10 శాతానికి కంటే తక్కువగా ఉన్నారు.

"ఫ్రాన్స్ లో దాదాపు 7.5 శాతం మంది ముస్లింలు ఉన్నారు, కాని ఫ్రెంచ్ ప్రజలు ముస్లింలు దేశంలో ముగ్గురు వ్యక్తులలో ఒకరు ఉన్నారు అని నమ్ముతారు. ప్రస్తుత పడమటి ఐరోపాలోని ముస్లిం మహిళలు ముస్లిమేతర మహిళల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నారు, కాని పరిశోధకుల అభిప్రాయం ప్రకారం పడమటి ఐరోపాలోని ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు చాలా వేగంగా క్షీణిస్తుంది, వారి సంతానోత్పత్తి రేట్లు కాలక్రమేణా తగ్గుతాయి " అని ది గార్డియన్, పీఆర్ బీ (జనాభా సూచనల బ్యూరో)ను ఉదాహరిస్తూ దిఅట్లాంటిక్ పేర్కొంది.

ది అట్లాంటిక్ తన నివేదికలో ముస్లిం ఫర్టిలిటి రేట్ పెరుగుదల(బర్మా తప్పితే) అనే మిధ్య భావన ప్రపంచవ్యాప్తం గా ఉంది, అది నిస్సందేహంగా తప్పుడు భావన అంటున్నది. ది అట్లాంటిక్ ఇలా అంటున్నది, "ప్రపంచ ముస్లిం జనాభా వేగవంతంగా పెరుగుతోంది కానీ ప్రపంచం లోని వివిధ ప్రాంతాలలో ముస్లిం జనాభా అంతే వేగంతో అభివృద్ధి చెందడం లేదు. ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న సబ్-సహారన్ ఆఫ్రికాలో ప్రాంతం లో ముస్లింలు సాంస్కృతికంగా ప్రత్యేకమైన మైనారిటీలు.

ఇస్లాం బ్రుణ హత్యలను ప్రోత్సహించదు. అట్లాంటిక్ ప్యూ రీసెర్చ్ ను ప్రస్తావిస్తు  ఇలా చెప్పింది, "ప్యూ నివేదిక ప్రకారం సంతానోత్పత్తికి మతం తో సంభందం లేదు. ఆర్థిక, సామాజిక సేవలు, మహిళా సాధికారత, సంఘర్షణలతో దగ్గిర సంభందం కలిగి ఉంటుంది. "1990-95మద్య అన్ని 49 ముస్లిం మతం-మెజారిటీ దేశాల్లో మహిళలసంతానోత్పత్తి శాతం 4.3 పిల్లల నుండి 2010-2015 లో 2.9 కు పడిపోయింది. ఇది 2015 లో ప్రపంచ సంతానోత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉంది. కానీ అదే కొన్ని పాశ్చాత్య యూరోపియన్ దేశాలలో స్త్రీలకు సరాసరి సంతానం ఆరు నుంచి మూడింటికి తగ్గటానికి  దాదాపు శతాబ్దం పట్టింది."

"ఆధునిక చరిత్రలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ లో వేగంగా సంతానోత్పత్తి తగ్గింది 1950 లో, ఇరానియన్ మహిళలకు సరాసరి  ఏడుగురి పిల్లలు ఉన్నారు, ఈ రోజు వారు అమెరికన్ల కంటే తక్కువగా1.68 మందిని కలిగి ఉన్నారు" అని నివేదిక పేర్కొంది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

 ముస్లిం నగారా ఆధ్వర్యంలో

నిర్విరామ అన్నదానకార్యక్రమం


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో అన్నదానం ఎనిమిదవ రోజు కోవిడ్ బాధితుల అటెండర్లకు అన్నదానం  పంపిణీ జరిగింది. హిందూపురం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం మరియు రోడ్డు ప్రక్కన హోటళ్లు లేక ఆకలితో అలమటిస్తున్న బాధితులకు ఆడిటర్ సదానంద కుటుంబీకుల ఆర్థిక సహకారంతో 100మంది ఆన్నార్తులకు అన్నదానం చేశారు.

 

  అనునిత్యం కోవిడ్ బాధితుల పట్ల సేవలు చేస్తున్న ముస్లిం నగారా.టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్. టిప్పు బ్రిగేడ్.టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం సభ్యులకు ఆడిటర్ సదానంద కుటుంబీకులకు పుర ప్రముఖులు ప్రశంసించారు.ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలోఈ కార్యక్రమము జరిగింది  జరిగిందిఆయనమాట్లాడుతూ కోవిడ్ బాధితులు భయాందోళనలకు గురి కాకుండా మూఢ విశ్వసాలను వీడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లలో చికిత్స చేయుంచుకొని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వాడుతూ చేతులను సబ్బు తో లేక శానిటయిజర్ తో శుభ్ర పరుచుకొంటు కోవిడ్ బాధితులకు వివక్ష చూపకుండా మనో ధైర్యాన్ని ఇస్తూ కోవిడ్ మహమ్మరిని పారద్రోలాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిప్పు బ్రిగేడ్ సభ్యులు ఇనాయతుల్లా.ఇర్ఫాన్.సు ల్తాన్ రియజుల్లా ఖాన్.తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలోపాల్గొన్నారు.


 


 సింగపూర్‌ నుంచి ద్రవరూపంలో ఉన్న మెడికల్‌ ఆక్సిజన్‌ను 

వైజాగ్‌ నౌకాశ్రయంలో అందుకున్న ఇండియన్‌ ఆయిల్‌


(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ)తో నింపబడిన 11 ఐఎస్‌ఓ ట్యాంక్‌లతో కూడిన కన్సైన్‌మెంట్‌ను ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ నేడు విశాఖపట్నం నౌకాశ్రయంలో అందుకుంది. సింగపూర్‌ నుంచి ఈ ఎల్‌ఎంఓను ఇండియన్‌ నేవీ నౌక ఐఎన్‌ఎస్‌ జలాశ్వ తీసుకువచ్చింది. ఇదే నౌక గెయిల్‌ సమకూర్చిన మరో రెండు ఐఎస్‌ఓ ట్యాంక్‌ల ఎల్‌ఎంఓను సైతం తీసుకువచ్చింది. దీనిని సైతం ఇండియన్‌ ఆయిల్‌ నిర్వహించింది. ఈ మొత్తం కన్సైన్‌మెంట్‌ను ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ  M/s బీఎన్‌ఎఫ్‌ సింగపూర్‌ వద్ద సేకరించడంతో పాటుగా దీనిని  సింగపూర్‌లోని M/sలిండే వద్ద పూరించింది. ఈ ఐఎస్‌ఓ ట్యాంక్‌లనుకోవిడ్‌ మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో సహకరించేందుకు వీలుగా ఎల్‌ఎంఓ సరఫరా మరియు రవాణా కోసం ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ లీజుకు తీసుకుంది. ఈ కన్సైన్‌మెంట్‌ ద్వారా వచ్చిన ఆక్సిజన్‌ను తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు వినియోగించనున్నారు.

ద్రవరూపంలోని వైద్య ఆక్సిజన్‌ కోసం డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుండటంతో పాటుగా రవాణా సమస్యలు కూడా ఎదురవుతున్న వేళ, ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ, కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ మార్గనిర్దేశకత్వంలో  వైద్య పరమైన ఆక్సిజన్‌ రవాణాకు అనువుగా ఉండే ఐఎస్‌ఓ ట్యాంక్‌లను దిగుమతి చేసుకుంది. అంతర్జాతీయంగా ఎంతోమంది ప్రాణాలను కాపాడటంలో ఆక్సిజన్‌ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందిప్పుడు. దాదాపు 75%కు పైగా పూరించబడిన ఐఎస్‌ఓ ట్యాంక్‌లను భారత నౌకాదళానికి చెందిన నౌక తీసుకువచ్చింది. ఖాళీ అయిన ట్యాంక్‌లను ఇక్కడ నుంచి ఇండియన్‌  ఎయిర్‌ ఫోర్స్‌ విమానమార్గంలో ఆక్సిజన్‌ సరఫరాదారుల వద్దకు  చేరుస్తుంది. సింగపూర్‌, కువైట్‌, అబుదాబీ మరియు కింగ్‌డమ్‌ ఆఫ్‌ సౌదీ అరేబియా నుంచి ఎల్‌ఎంఓను అంతర్జాతీయ సరఫరాదారులు M/sలిండే , M/sఎయిర్‌లైఫ్‌, M/sఎయిర్‌ లిక్విడ్‌కు సరఫరా చేస్తున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ ఇప్పటికే ఎల్‌ఎంఓకు సంబంధించిన పలు కన్సైన్‌మెంట్స్‌ను మంగళూరు, బెంగళూరు సహా పలు దక్షిణాదిరాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.

ఎల్‌ఎంఓ, ఆక్సిజన్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లుకు సంబంధించిన పలు దిగుమతులను ఐసీఆర్‌ఎస్‌ (ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ) చేశాయి. వీటిని సైతం ఇండియన్‌ ఆయిల్‌ నిర్వహించడంతో పాటుగా వాటి దిగుమతి, రవాణా కార్యక్రమాలను సైతం నిర్వహించింది.

బాధ్యతాయుతమైన కార్పోరేట్‌ సిటిజన్‌గా, ఇండియన్‌ ఆయిల్‌ తమ నైపుణ్యం, వనరులపై ఆధారపడి దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కోవిడ్‌–19 మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రభావం నుంచి దేశం బయటపడేందుకు తోడ్పాటునందిస్తుంది.

భారతదేశంలో ఎల్‌ఎంఓ నిర్వహణ మరియు రవాణాకు సంబంధించిన  ఇతర కార్యక్రమాలలో  సంజీవని ఎక్స్‌ప్రెస్‌ సహా పలు కార్యక్రమాలున్నాయి. వైద్య పరమైన అవసరాల కోసం వినియోగించే ఆక్సిజన్‌ కేటాయింపులు, డిశ్పాచ్‌, రిసిప్ట్‌నుపర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా వాటాదారులందరికీ సహాయపడుతూనే వాస్తవ సమయంలో సైతం పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సింగల్‌ విండో అప్లికేషన్‌ సంజీవని ఎక్స్‌ప్రెస్‌.

 యథా రాజా తథా ప్రజా

లాక్ డౌన్ ఉల్లంఘనలకు కేసీఆరే కారణం

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ప్రజలు లాక్ డౌన్ ను తేలికగా తీసుకోవటానికి కారణం ముఖ్యమంత్రి కె.సి.ఆరేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ పేర్కొన్నారు. ఓవైపు అందర్నీ మాస్క్ ధరించాలని ఆదేశిస్తూ మరోవైపు స్వయంగా కేసీఆర్ మాస్క్ లేకుండా వరంగల్ జైలు సందర్శించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా జి.నిరంజన్ మాట్లాడుతూ...తాను స్వయంగా కోవిడ్ నిబంధనలు పాటించ కుండా ఇతరులను పాటించమని సీఎం కేసీఆర్ ఎలా మార్గనిర్దేశం చేస్తారని ఆయన ప్రశ్నించారు. స్ట్రిక్ట్ గా అమలు చేయమని కె.సి.ఆర్ రాష్ట్ర డి.జి.పి ని ఆదేశిస్తే పోలీసు యంత్రాంగం చలానలు రాయడం, వాహనాలు జప్తు చేయడం వంటి చర్యలతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుందని ఆయన అన్నారు. లాక్ డౌన్ వేస్ట్ అన్న కె.సి.ఆర్ లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేయాలని డీజీపీని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ చేపట్టామంటున్న కె.సి.ఆర్ కు ప్రజలు కోల్పోతున్న ఆదాయం, ఉపాధి గురించి పట్టింపే లేదని విమర్శించారు. ఒక వైపు కరోనా బారిన పడిన ప్రజలకు వైద్య సౌకర్యాలు, మందులు, వ్యాక్షిన్లు లేవు, మరొక వైపు లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వ పక్షాన ఆసరా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వమిచ్చిన నాలుగు గంటల వ్యవధిలో తమ వ్యాపారాలు 10 గంటల వరకు చేసుకుని, మూసిన తర్వాత ఎలాగా తమ ఇళ్లకు చేరగలరనే సోయి ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... అస్తవ్యస్త వ్యవహారము, పోలీసుల అత్యుత్సాహ కారణాన విద్యుత్ ఉద్యోగులు నల్గొండలో ఈ రోజు రెండు గంటల పాటు విద్యుత్ సరపరా నిలిపి వేయడము, పరిస్తితికి అద్దము పడుతుందన్నారు. లాక్ డౌన్ విధించి ప్రభుత్వము చేతులు దులుపు కోవద్దు.  ప్రజల కనీస అవసరాలను ఉచితంగా అందజేయాలి. ప్రభుత్వము అందజేస్తే ప్రజలెందుకు బయట కెళ్ళి తిప్పలు పడతారు.పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాలు కె.సి.అర్ ను ప్రసన్నము చేసుకోవడానికి, తృప్తి పరచడానికి, ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దు. వారి అవసరాలను ప్రభుత్వము తీరిస్తే ఎవ్వరూ బయటకెళ్లరని గమనించాలి. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రజలను ఆదుకునేందుకు ఇక తాను చేసేది ఏమి లేదని చేతులెత్తేసినట్టుంది, అందుకే గాంధీ, ఎం.జి.ఎం ఆసుపత్రుల బాట పట్టారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది,జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాటు, వరంగల్ కెంద్ర కారాగారాన్ని తరలించి అక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడము కాదు, వారికి కావల్సింది తత్క్షణ చేయూత, వైద్య సౌకార్యాలు, మందులు, వ్యాక్షిన్, ఆక్షిజన్,. థర్డ్ వేవ్ నుండి సంరక్షణ  ఆయన పర్యటనలు చిత్తశుద్ధి లేనివి. కేవలము ఏదో చేస్తున్నట్టు ప్రజలను మభ్య పెట్టి, మీడియా దృష్టిని అసలు సమస్యలపై కాకుండా తన చుట్టు త్రిప్పు కోవడానికే. అని ఆయన పేర్కొన్నారు.


 ఆత్మవిశ్వాసంతో కోవిడ్ ను ఎదుర్కొందాం

ముస్లిం నగరా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో అన్నదానం ఏడవరోజు కోవిడ్ బాధితుల అటెండర్లకు అన్నదానం  పంపిణీ చేశారు. హిందూపురం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం మరియు రోడ్డు ప్రక్కన హోటళ్లు లేక ఆకలితో అలమటిస్తున్న బాధితులకు ఆడిటర్ సదానంద కుటుంబీకుల ఆర్థిక సహకారంతో 100మంది ఆన్నార్తులకు అన్నదానం చేశారు.  అనునిత్యం కోవిడ్ బాధితుల పట్ల సేవలు చేస్తున్న ముస్లిం నగారా.టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్. టిప్పు బ్రిగేడ్.టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం సభ్యులకు ఆడిటర్ సదానంద కుటుంబీకులకు పుర ప్రముఖులు ప్రశంసించారు.

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలోఈ కార్యక్రమము జరిగింది  జరిగింది. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ కోవిడ్ బాధితులు భయాందోళనలకు గురి కాకుండా మూఢ విశ్వసాలను వీడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లలో చికిత్స చేయుంచుకొని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వాడుతూ చేతులను సబ్బు తో లేక శానిటయిజర్ తో శుభ్ర పరుచుకొంటు కోవిడ్ బాధితులకు వివక్ష చూపకుండా మనో ధైర్యాన్ని ఇస్తూ కోవిడ్ మహమ్మరిని కూకటి వేళ్ళతో పెకిలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిప్పు మానవతా రక్తదాన సంఘం అధ్యక్షుడు షేక్ షబ్బీర్ టిప్పు బ్రిగేడ్ అధ్యక్షుడు అతీఖుర్రహమాన్ అలీ. టిప్పు బ్రిగేడ్ సభ్యులు ఇనాయతుల్లా.ఇర్ఫాన్.సుల్తాన్ పైల్వాన్ సాదీఖ్.రియజుల్లా ఖాన్.తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలోపాల్గొన్నారు.


 

ఆనందయ్య ఆయుర్వేదం

ప్రజలకు ఒక కొత్త అవగహన కల్పించింది

జెడ్ కేటగిరీలో ఆయనకు రక్షణ కల్పించాలి

వెల్పేర్ పార్టీ ఆప్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్


(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య కోవిడ్ వైద్యం రాష్ట్ర ప్రజలలో ఒక కొత్త నూతన ఉత్సాహం ,ఆశ కల్పించిందని, రోగనిరోధక శక్తికై ఈ దృక్పథం అత్యంత అవసర మని న్యాయవాది, వెల్ఫర్ పార్టీ ఆఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహమ్మద్ అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వై.ఆనందయ్య ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఒక కొత్త ఒరవడి నేర్పిందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య సేవలను రాష్ట్రంలో ఉపయోగించు కోవాలని ఆయన కోరారు. కోవిడ్ నియంత్రణకు ఆయన్ని సలహదారునిగా నియమించాలని ఆయన కోరారు. ఆనందయ్యకు జెడ్ కేటగిరీ రక్షణ కలిపించాలని కోరారు. కరోనా రాకుండా కాని కరోనా చికిత్సకు గాని దేశవ్యాప్తంగా సరైన సదుపాయాలు లేనప్పుడు అత్యంత చౌకగా వేగంగా ఆనందయ్య అయిర్వేదం ప్రభుత్వం ప్రతీ వాలంటీర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో కి తెచ్చి ప్రపంచానికి ఒక దశ,దిశ చూపి ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. ఆయుర్వేదం యునాని,హోమియో మందులను వాటిని ప్రోత్సహించాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాయనున్నట్లు ఐ.ఎం.అహమ్మద్ తెలిపారు. ఈ సమావేశంలో లాయర్స్ ఫర్ సోషల్ జస్టీస్ అధ్యక్షులు న్యాయవాదీ జి సుబ్బారావు, మక్కా మజీద్ కార్యదర్శి అమీర్ జాన్ తదితరులు మాట్లాడారు.

జర్నలిస్టులకు,,,

ఎన్-95 మాస్కులు,సానిటైజర్ ల పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

బృందావనం,భారతి గార్డెన్స్,భారతి డిజిటల్స్ అధినేత గాదె కృష్ణ సౌజన్యంతో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎన్-95 మాస్కులతో పాటు10 లీటర్ల సానిటైజర్ డబ్బాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ రాజేశ్వర చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ కమిటీకి అందజేశారు.శనివారం జిలా అదనపు కలెక్టర్ చాంబర్ లో జర్నలిస్టులకు వారు పంపిణీ చేసారు.
కరోనా విపత్కర సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు భారతి సంస్థల ఎండి గాదె కృష్ణ ఈ సేవా కార్యక్రమం చేపట్టడం ఆభినందనీయమని ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్నారు.కరోనా కష్ట కాలంలో నేనున్నాంటూ గాదె క్రిష్ణ జర్నలిస్టులకు అండగా ఉండడం అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.కరోనా బారిన పడి జిల్లాలో ఇప్పటి వరకు ఆరుగురు జర్నలిస్టులు మరనించగా వందలాది మంది జర్నలిస్టులు కరోనా పాజిటివ్ కు గురయ్యారని వారి ఆరోగ్యాల రక్షణకు గాదె క్రిష్ణ  ముందుకు రావడం చాల గొప్ప విషయమని ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కోశాధికారి రామకృష్ణ,రాజులు అన్నారు.ఈ కార్యక్రమంలో భారతీ సంస్థల ప్రతినిధులు జగన్,అంగిరేకుల సాయిలు,ధనుంజయ్,ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.