రైతు మహాగర్జనకు రాకేష్ సింగ్ తికాయత్
తికాయత్ ప్రసంగాన్ని అనువాదం చేసి రైతుల్లో ఉత్సాహం నింపిన జర్నలిస్ట్ షఫీ
అమరావతి రైతుల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇందులో భాగంగా సోమవారంనాడు రైతు మహాగర్జన జరిగింది. ఆ సందర్భంగా జాతీయ రైతు ఉద్యమ నాయకుడు, ఢిల్లీలో రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాకేష్ సింగ్ తికాయత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షఫీ తెలుగులో అనువాదం చేసి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రప్రంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఓ మహా ఉద్యమ నేతకు నేరుగా కలవడం ఆయన ఉపన్యాసాన్ని తెలుగు వారికి యధాతథంగా వినిపించే అవకాశం తనకు రావడం నిజంగానే మహద్భాగ్యం అని జర్నలిస్ట్ షఫీ పేర్కొన్నారు. ఇదిలావుంటే రాకేస్ సింగ్ తికాయత్ ప్రసంగాన్ని సరైన రీతిలో అనువాదం చేసిన మహాగర్జనలోని రైతాంగాన్ని వినిపించే సరైన వ్యక్తి కోసం అక్కడి నిర్వాహకులు అన్వేషణ చేయడం, మహమ్మద్ షఫీ ని ఒంగోలు లో సాయంత్రం 4 గంటలకు జరుగుతున్న మహా పంచాయత్ లో రాకేష్ తికాయత్ ప్రసంగాన్ని అనువ దించమని అక్కడక్కకూ ఆగమేఘాల మీద ఆయన్ని తీసుకెళ్లారు.
రాకేష్ సింగ్ తికాయత్ సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షఫీ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: