బాధ్యతారాహిత్యంగా ఎన్నికల కమీషన్ తీరు 

జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కరోనా తీవ్రతను పట్టించుకోని ఎన్నికల కమిషన్ తీరు దురదృష్టకరమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు తల్లడిల్లు తుంటే, ఎమైనా కానీ మేము మాత్రము ఎన్నికలు నిర్వయిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించడము ఆక్షేపణీయం, భాధ్యతారాత్యం. కోవిడ్ నిబందనలను పాటిస్తలేరని రాజకీయ నాయకులను ఆక్షేపిస్తున్న ఎన్నికల కమిషన్ తన భాధ్యతను ఎందుకు విస్మరిస్తుందో చెప్పాలి..? ఈ రోజు విడుదల చేసిన నోటిఫికేషన్లో తమకున్న విశేష అధికారాలను, సుప్రీమ్ కోర్టు తీర్పులను ఉటకించిన కమిషన్ , ఆ అధికారాలను అభ్యర్థుల ప్రచారాన్ని కుదింపు చేయడానికి వినియోగించిందే కాని, ఎన్నికలను వాయిదా వేయడానికి ఎందుకు ఉపయోగించ లేదు? ప్రభుత్వ వత్తిడియే కారణమా? జవాబు చెప్పాలి. మునిసిపల్ ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమైనదంటున్న ఎన్నికల కమీషన్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జెడ్.పి.టి.సి, ఎమ్.పి.టి.సి, సర్పంచ్ పదవులకు ఎందుకు ఎన్నికలు ప్రకటించ లేదు. ఈ ద్వంద్వ విధాన మెందుకు. అని ఆయన ప్రశ్నించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: