ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలు
వైసీపీకి ఓటు వేయండి అభివృద్ధికి దోహదపడింది
తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఓటర్లకు డాక్టర్ ఏలూరి విజ్ఞప్తి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురు మూర్తి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కోరారు.తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ,అయితే భారీ మెజార్టీ సాధించే దిశగా పెద్ద ఎత్తున ఓటర్లు పార్టీకి మద్దతు పలకాలని కోరారు .ఈ మేరకు ఆయన శనివారం తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓటర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు .తమ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలో వివరించారు .గత ఇరవై రెండు నెలల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దేశం గర్వించదగ్గ పథకాలు ఎన్నింటినో ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు .ఇప్పటికే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని ,బడుగు బలహీన వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు .రాష్ట్రంలో ఆర్థికపరంగా క్లిష్ట పరిస్థితి ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ధి థకాల విషయంలో పేదల పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని ,నవ్యాంధ్ర నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నారని ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఏయే పథకాలను ఏయే కుటుంబానికి అందిస్తున్న విషయమై స్వయంగా లేఖలు రాసిన విషయాన్ని డాక్టర్ రామచంద్ర రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మద్దతుగా ఓటర్ల తీర్పు ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్క ఓటర్ మరి కొంత మందితో ఓట్లు వేయించాలని డాక్టర్ రామచంద్రారెడ్డి కోరారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా రెండు సార్లు లేఖల ద్వారా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు చేసిన విజ్ఞప్తిని గుర్తు చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలోనే ప్రజల మేలు కోరి ఈనెల 14వ తేదీన నిర్వహించాల్సిన బహిరంగ సభను కూడా ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారని చెప్పారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గెలవాల్సిన చారిత్రక అవసరమున్నదని డాక్టర్ రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పెట్రేగిపోతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు కూడా వెనకాడడం లేదని విమర్శించారు. ప్రజాస్వామిక ఎన్నికల్లో గెలుపు కోసం ఇంతగా దిగజారడం ఇదెక్కడి చోద్యం అని ఆయన ధ్వజమెత్తారు .ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినప్పటికీ తమ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు .ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎస్సీ ,ఎస్టీ , బిసి ,మైనారిటీ ,ఇతర అన్ని వర్గాల వారు మెజారిటీ ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని, తమకు ప్రస్తుత ఉప ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలనే విషయాన్ని డాక్టర్ రామచంద్రా రెడ్డి మరోసారి గుర్తు చేశారు.విపక్షాల ప్రలోభాలకు ఏమాత్రం కుంగవలసిన అవసరమే లేదని, వైఎస్సార్సీపీ నాయకత్వం తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అండదండలు ఎల్లప్పటికీ ఈ ప్రాంత ప్రజల పట్ల తప్పకుండా ఉంటాయని డాక్టర్ రామచంద్రా రెడ్డి భరోసా ఇచ్చారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: