మరో చరిత్రాత్మక విజయం...

అందుకోనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగే తరువాయి

ముఖ్యమంత్రి సమర్ధ పాలనతో  వార్ వన్ సైడే

రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఈ నెల 8 వ తేది జరుగనున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో చారిత్రాత్మక ఘన విజయం సాధించబోతుందని రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేరుకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందే తప్ప ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టేందుకు మానసికంగా ఎప్పుడో సిద్దమయ్యారని,దింతో వార్ వన్ సైడ్ మాత్రమేనని అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే  రేపు 10 వ తేది జరుగు కౌంటింగ్ లో పునరావృతం కానున్నాయని డాక్టర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన చంద్రబాబు తిరిగి అవే ఫలితాలు ఈ ఎన్నికల్లో కూడా చూడాల్సి వస్తుందనే భయంతోనే ఎన్నికలను బహిష్కరించారని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక స్థానాల్లో తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని,
ఇక మిగతా స్థానాల్లో కూడా మా అభ్యర్థుల గెలుపు నల్లేరు పై నడక మాత్రమేనని, దీనికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలేనని, అ పథకాలన్నీ పేద ప్రజలకు చేరువయ్యాయని అన్నారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల ఫలితాల తీర్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు సంవత్సరాల పాలనకు రెఫరెండం అని గుర్తు చేశారు.  దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు  వైఎస్ జగన్ పాలనను ఆదర్శంగా తీసుకొంటున్నారని, ఇది ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో గెలుపు ఖాయమైనప్పటికి నిర్లక్ష్యం చేయకుండా వైసీపీ అభ్యర్థుల ఓటింగ్ శాతాన్ని ఘననీయంగా పెంపొందించుకునే విధంగా కృషి చేయాలని రాష్ట్ర వైసిపి నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పార్టీ నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: