అంబేద్కర్ పథమే జగన్ పంథా 

 దేశం గర్వించదగ్గ నేత భారతరత్న 

-వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత డాక్టర్ రామచంద్రారెడ్డి 

 కూకట్పల్లి లో ఘనంగా అంబేద్కర్ జయంతి, నివాళులు

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక, రాజకీయ, స్వాతంత్ర్య, సామాజిక స్వావలంబనకు పాటుపడుతున్నారని రాష్ట్ర వైఎస్ఆర్సిపి నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. రాజ్యాధికారంలో వెనుకబడిన,ఇతర అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పిస్తూ గుర్తింపు ఇస్తున్నారని పేర్కొన్నారు.భారతరత్న,  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని బుధవారం కూకట్ పల్లిలోని బాలానగర్ జంక్షన్ లో  ఘనంగా నిర్వహించారు. భారత జాతికి డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజంలో గుర్తింపు లేని జాతులు, వర్గాలకు కూడా సముచితమైన ప్రాధాన్యం  కల్పిస్తున్నారని చెప్పారు.అంతే కాకుండా వారికి కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ స్థాయిలలో పదవులను, గౌరవాన్ని ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత నివ్వడంతో పాటు సమాజంలో అంతా సమానమే అనే రీతిలో ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. కరోనా నేపథ్యంలో వాలంటీర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా  వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారని చెప్పారు. సమాజంలో అంతా సమానమేనని ముఖ్య మంత్రి  నిరూపించారని  డాక్టర్ రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ లో  నూరు శాతం అంబేద్కర్ ఆశయాలు అమలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.పారదర్శకంగా, అవినీతి రహితంగా పరిపాలన సాగుతున్నదని చెప్పారు. ప్రతి పథకానికి సంబంధించి  లబ్ధిదారులకు వారి వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ సంక్షేమ పథకాలు ఎన్నిటినో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారని, మహిళా సాధికారత నెలకొందని తెలియజేశారు. జగన్ పథకాల వల్ల మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడి మనుగడ సాధించే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అంతేకాకుండా మహిళలు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దబడుతున్నారని రామచంద్రారెడ్డి అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను ఒకవైపు పరిరక్షిస్తూనే, మరోవైపు సంపూర్ణంగా అమలు దిశగా పయనిస్తూ అభినవ అంబేద్కర్ గా జగన్ మోహన్ రెడ్డి కీర్తించబడుతున్నారని అన్నారు. భవిష్యత్తులో భారతదేశం గర్వించదగ్గ మరెన్నో పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారని, కేవలం ఇరవై రెండు నెలల కాలంలోనే పరిణతితో కూడిన పరిపాలనను అందిస్తూ అన్ని వర్గాల ఆదరణను ముఖ్యమంత్రి చూరగొన్నారని డాక్టర్ రామచంద్రా రెడ్డి చెప్పారు. అంబేద్కర్ విలువలకు పట్టం కడుతూ రాజ్యాంగ నిర్దేశకత్వంలో సంపూర్ణమైన పరిపాలన అందిస్తున్న ఘనత దేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే  దక్కుతుందని ఆయన అభివర్ణించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: