కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
ప్రజారోగ్య ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సీతక్క
పేదలకు ప్రైవేటు వైద్యం అందించాలని డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదలకు ప్రైవేటు వైద్యం అందించాలని ఏర్పాటు చేసిన " ఆరోగ్యశ్రీ" పథకం కింద కరోనా చికిత్స చేయాలని సోమవారం ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పేదలకు ప్రైవేట్ వైద్యం అందాలంటే ప్రస్తుతమున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా చికిత్స కోసం ఖర్చు చేసిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు డబ్బులు చెల్లించాలని తెలిపారు. ఎన్ ఎస్ యు ఐ నేత బలమౌర్ వెంకట్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరప్రధానం అన్నారు. కరోనా బారినపడి ప్రాణాలను సైతం కోల్పోతున్నారనీ ఎద్దేవా చేశారు. లక్షల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువయ్యింది అని ఆరోపించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలని నిరాహార దీక్ష చేపట్టినట్లు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: