పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి
జానోజాగో సంఘం నేత సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్
జానోజాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం 58 శాతం పైగా ఎరువుల ధరలను పెంచడాన్ని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున ఎరువుల ధరలు పెంచి రైతుల పై పెనుభారం మోపిందన్నారు. ఇప్పటికే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రకృతి వైపరీత్యాలతో సరైన ది గుబడి రాకా తీవ్రంగా నష్టపోయిన టువంటి అన్నదాతలకు ఎరువుల ధరలు పెంచడం మరింత తీవ్రమైన భారాలు మోపడమే అన్నారు.
డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులుఅమలుచేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వంమరో మూడునల్ల చట్టాలు రైతుల పైన రుద్ది రైతులను సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నాలు కేంద్రప్రభుత్వం చేస్తుందన్నారు. ఐదు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల యొక్క సమస్యలు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు లాభాలు చేకూర్చే పద్ధతిలో ధరలు పెంచింది అన్నారు .ఎరువుల ధరలు పెరగడానికి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కూడా ఒక కారణమని అన్నారు. దీనికంతటికీ కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలే కారణమన్నారు. వెంటనే ఎరువుల ధరలు తగ్గించాలని లేదంటే . కేంద్ర ప్రభుత్వానికి రైతాంగం బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: