పీడీఎస్ యూ, ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో,,,
ఘనంగా అంబేద్కర్ జయంతి
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతిని స్థానిక నంద్యాల పట్టణంలో పీడీఎస్ యూ, ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ ఇన్సాఫ్ జిల్లా నాయకులు షరీఫ్ భాష మాట్లాడుతూ ఓ మహానుబావుడా దళిత జాతి రత్నమా, మా బానిస సంకెళ్లు తెంచిన యోధుడ,మాకు జీవితాలను ఇచ్చిన నిన్ను మార్వలేము మా గుండెల్లో గుడి కట్టి జీవిస్తున్నము. దళితునిగా ఉండి విద్యార్థి దశ నుండి ఎన్నో అవమానాలు భరించి దళితులు అంటరనివాళ్లుగా చూస్తున్న ఉన్నత వర్గాల వారికి కళ్ళు తెరిపించి అందరూ సమానం అనేలా నిరూపించి ఎన్నో ఉన్నత చదువులు చదివి చివరకు మన భారత రాజ్యాంగాన్ని రచించి న యోధుడు అంబెద్కర్ అని కొనియాడారు. కుల,మత, వర్గ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా చేసుకొని దేశం లోని ప్రజలందరు సమానత్వం తో జీవించాలని కోరుకున్నాడు.అదే విధంగా దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరి పైన వివక్షత చూపుతున్న వారి కళ్ళుతెరిపించేలా చేసిన మహానీయుడు మన అంబెద్కర్.అయ్యా అంబెడ్కర కనిపించని దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కాని కనిపించే మా దైవం నువ్వెనని,మనుషులు మనుషులు గా బ్రతకడానికి ఎన్నో అవకాశాలు కల్పించావని, చీకటి బ్రతుకుల వెలుగు అయ్యాడని ఆయన ఆశయ సాధనకోసం విద్యార్థి యువజనుల ముందుకు నడవాలని పిలుపు నిచ్చారు .
ఈ కార్యక్రమంలో లో ఇన్షాఫ్ కమిటీ నాయకులు మా భాష వామపక్ష పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య గౌడ్ మల్లికార్జున బ్రహ్మం గౌడ్ పీడీఎస్ యూ డివిజన్ నాయకులు బాలు,రాం బాబు,చంద్రశేఖర్, మహేంద్ర,జవీద్,కోట్స్, జిలాని,నాయక్ తదితరులు పాల్గొన్నారు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: