కరోనాపై అవగాహన కార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని మీర్జాపేట గ్రామపంచాయతీ లోని మీర్జా పేట కారుమా నుపల్లి గ్రామాలలో కరోనా గురించి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పంచాయతీ కార్యదర్శి గీత ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో తిరిగి కరోనా సెకండ్ వే గురించి అవగాహన కల్పించుటకు గ్రామాల్లోర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని భౌతిక దూరం పాటించాలని ఏ విధమైన అపోహలకు తావు లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని
కోవిడ్ 19 లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని నినాదాలు చేస్తూ గ్రామ వీధులలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ క్రాంతి పదం ఏ పీ ఎం డి. పిచ్చయ్య, మురారి. వెంకటేశ్వర్ల మరియు కాశయ్య, సచివాలయ ఉద్యోగస్తులు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: